బాలయ్య ఎప్పుడు ఎలా ఉంటారో.. ఏ నిముషంలో ఆయన మూడ్ ఎలా మారుతుందో..? ఎందుకైనా మంచింది, షూటింగ్ సమయంలో ఆయనకు కొంచెం దూరంగా ఉండు’ ఇలాంటి సలహాలు ఇస్తుంటారు బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నారని తెలిస్తే. తనకు అలాంటి సలహాలే ఇచ్చారని.. కానీ సెట్ లో బాలయ్య బాబును చూసి ఆశ్చర్యపోయాను అంటోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న సమయంలో బోయపాటి నుండి ప్రగ్యాకి కాల్ వచ్చిందట.
నేను బాలయ్య బాబుతో చేస్తోన్న సినిమాలో మీరే హీరోయిన్ అని బోయపాటి చెప్పగానే ప్రగ్యా తెగ భయపడిపోయిందట. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడుతూ…’నేను భయపడటానికి కారణం అప్పటికే బాలయ్యగారికి బాగా కోపం అని విన్నాను. పైగా నేను అఖండ సినిమా చేస్తున్నాను అని తెలియగానే.. బాలయ్యగారు సెట్ లో ఉన్నప్పుడు, నువ్వు చాలా సైలెంట్ గా ఉండు అంటూ కొందరు నాకు సలహా ఇచ్చారు.
అందుకే నేను ఫస్ట్ డే షూట్ లో చాలా సైలెంట్ గా ఉన్నాను. కానీ, బాలయ్యగారు నవ్వుతూ పలకరించడం, తోటి నటీనటులకు ఎంతో గౌరవం ఇవ్వడం చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అప్పటివరకు జూనియర్ ఆర్టిస్ట్ ల పట్ల ఏ హీరో అంత మర్యాదగా ప్రవర్తించడం నేను చూడలేదు. పైగా సెట్‌లో బాలయ్య బాబుగారు చాలా సరదాగా ఉండటాన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. బయట ఆయన పై ఉన్న టాక్ కి, ఆయన ప్రవర్తనకు చాల తేడా ఉంది.
నిజంగా ఆయన అంత కూల్‌గా ఉండటం వల్లే నేను చాలా ధైర్యంగా నటించానని చెప్పుకొచ్చింది ప్రగ్యా. ఇక ‘అఖండ’ సినిమాలో బాలయ్య బాబుతో రొమాన్స్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది ప్రగ్యా. కెరీర్ స్లోగా ఉంది కాబట్టి, ఆమెకు ఇప్పుడు బాలయ్య బాబు సినిమానే అత్యంత కీలకం. అందుకే ఈ సినిమా కోసం బాలయ్య కంటే కూడా ‘ప్రగ్యా జైస్వాల్’నే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తోందట. అలాగే గ్లామర్ విషయంలో ముఖ్యంగా ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా ప్రగ్యా ముందుకు వెళ్తుందట. మరి హీరోయిన్ గా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన ఈ బ్యూటీకి, అఖండ పెద్ద ప్లస్ అవ్వనుంది.