Boyapati Srinu: మాస్ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బోయపాటి శీను గురించి మనందరికీ తెలిసిందే.ఈయన వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎవరు చేయలేని విధంగా మాస్ సినిమాలను చేసి మెప్పిస్తున్నారు. ఇక ఈయన బాలయ్య బాబు తో వరుసగా సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. అయినప్పటికీ రీసెంట్ గా స్కంద సినిమాతో హీరో రామ్ ని మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ లో చూపించి మెప్పించారు.
అయినప్పటికీ బోయపాటి చేసిన ఈ సినిమా ఆవరేజ్ టాక్ ను అందుకొని ఈ సినిమా ఇప్పటికీ ముందు దూసుకెళ్తుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి ఆ ఇంటర్వ్యూలో అఖండ సినిమా గురించి ప్రస్తావిస్తూ అఖండ సినిమా అనేది నేను ఇచ్చిన కథ తో, నేను చేసిన మేకింగ్ తో చాలా బాగా ఆడింది అని చెప్పాడు. దాంతో ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన ఆ సినిమాలో బిజీయం కూడా చాలా హైలెట్ అయింది కదా దానివల్లనే సినిమా ఆడిందని చాలామంది అంటుంటారు. బిజియం తో సినిమా ఆడింది అనేది చాలా అబద్ధం ఎందుకంటే సినిమాలో మ్యాటర్ ఉంటే తప్ప సినిమా ఆడదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన స్కంద సినిమా మాత్రం ఆవరేజ్ టాక్ తో ఆడుతుంది కదా అని అన్నప్పుడు అవును సినిమా బాగుంది, కానీ ప్రేక్షకులకి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. మరి ఈ సినిమాలో బిజీయం అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కదా అంటే బిజియం వర్కౌట్ అవ్వనందుకే సినిమా అంతా బాగా ఆడటం లేదు అని బోయపాటి అంటూనే నేను అందుకే తమన్ కి ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు.
దాంతో ఆ ఇంటర్వ్యూ చూసినా వాళ్లంతా అఖండ సినిమా ఆడితేనేమో నీ మేకింగ్ వాళ్ల ఆడింది బిజిఎం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం ఏం లేదు. కానీ స్కంద సినిమా ఆవరేజ్ అయితే మాత్రం అది మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బీజియం బాగా లేకపోవడం వల్లే ఆ సినిమాకి అవరేజ్ టాక్ వచ్చింది అని అంటున్నావ్ నీకేమైనా మైండ్ దొబ్బిందా బోయపాటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.నువ్వు మాట్లాడిన మాటల్లోనే లాజిక్ ఎలా మర్చిపోయావ్ బోయపాటి అంటూ చాలామంది ఆయనకి నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు… మరికొంతమంది అయితే బోయపాటి బాలయ్య బాబుకి తప్ప వేరే హీరోలకు సక్సెస్ ఇవ్వలేడు ముఖ్యంగా యంగ్ హీరోలకి అసలు సక్సెస్ ఇవ్వలేడు అని అంటున్నారు…