Sundaram Master: తెలుగు నాటక రంగానికి చెందిన రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు చనిపోతే.. ప్రముఖ కొరియోగ్రఫర్, ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టారు చనిపోయారని పుకార్లు పుట్టించారు. ఈ తెలిసి తెలియని సమాచారం వల్ల ప్రభుదేవా ఫ్యామిలీ చాలా బాధ పడింది. ఒక విషాద వార్త వచ్చినప్పుడు కచ్చితంగా అది నిర్ధారణ చేసుకుని పబ్లిక్ కి ఆ సమాచారాన్ని ఇవ్వాలి.

జర్నలిజంలో ఇది అతి ముఖ్యమైన విషయం. కానీ, కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు కూడా ఇలాంటి ఫేక్ వార్తలను ఇష్టానుసారంగా ప్రసారం చేయడం సిగ్గుచేటు తనం. మొత్తానికి నెట్టింట్లో జరిగిన ఈ గందరగోళానికి ప్రభుదేవా ఫ్యామిలీ సీరియస్ అయ్యింది. అసలు సుందరం మాస్టారు చనిపోలేదు. చనిపోయిన సుందరం మాస్టారు వేరు అని క్లారిటీ ఇస్తున్నా… ఇప్పటికి కొంతమంది సుందరం మాస్టర్ చనిపోయాడు అంటూ ప్రభుదేవా తండ్రి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.
Also Read: షాకింగ్: ప్రధాని మోడీ కేవలం రెండు గంటలే నిద్రపోతారా? నిజమేనా?
ఏమిటి ఈ దరిద్రం. ఇంతకీ చనిపోయిన సుందరం మాస్టారు ఎవరు అంటే.. ఆయన దాదాపు రెండు వందలకు పైగా నాటకాల్లో నటించారు. సుందరం మాస్టారు కన్నుమూయడంతో పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సుందరం మాస్టారు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.
తల్లావఝ్జల సుందరం మాస్టర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నేడు మరింతగా విషమించింది. దాంతో ఆయన మృతి చెందారు.
కాగా మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున తల్లావఝ్జల సుందరం మాస్టర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: వైసీపీ నేతలతో బాలకృష్ణ పీఏ జూదం.. చివరకు ఏం జరిగింది?