Highest Pre Release Business Movies In Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇతర భాషల్లో కూడా మన స్టార్ హీరోలకు మార్కెట్ ఉండటంతో.. ఆ భాషల్లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లోనే అవుతోంది. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ సినిమాలు ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్‌లు చేశాయో ఓ సారి చూద్దాం.
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.450 కోట్లకు పైగా చేసింది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో అన్నింటికంటే దీనికే ఎక్కువ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక దీని తర్వాత బాహుబలి-2 మూవీ నిలిచింది. ఈ మూవీ ఐదేళ్ళ క్రితం వచ్చినా.. ఆ కాలంలోనే రూ.372 కోట్ల బిజినెస్ చేసింది. ఈ మూవీ రూ.850 కోట్లు షేర్ రాబట్టింది. ఇక దీని తర్వాత సాహో మూవీ నిలించింది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ కాబట్టి రూ.270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. కానీ రూ.217 కోట్లు షేర్ మాత్రమే రాబట్టింది.
Also Read: NTR Bike In RRR Movie: ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ బైక్ ఖర్చు ఎంతో తెలుసా?
ఇక ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ కూడా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. రూ.200 కోట్ల బిజినెస్ జరగ్గా… ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రూ.100 కోట్లు కూడా షేర్ రాబట్టలేకపోయింది. చివరకు డిజాస్టర్‌గా మిగిలింది. ఇక వీటి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ కూడా భారీగానే బిజినెస్ జరుపుకుంది.
ఈ మూవీ రూ.187 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ రూ.135 కోట్ల షేర్ మాత్రమే రాబట్ట గలిగింది. రూ.50 కోట్ల నష్టాలను తీసుకు వచ్చింది. ఇలా ఇప్పటి వరకు ఈ మూవీలే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలుగా నిలిచాయి.
Also Read: RRR Mania: ఆర్ఆర్ఆర్ మేనియా: వందల టికెట్లు కొంటున్న రాజకీయ నేతలు.. ఫ్యాన్స్ స్పెషల్ షోలు