Jabardasth Comedians Remuneration: బుల్లితెరపై జబర్ధస్త్ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందులో చేసిన వారికి సినిమాల్లో కూడా వరుస ఛాన్సులు వస్తున్నాయంటే.. ఎంత బ్రాండ్ గా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా జబర్ధస్త్‌లో ఇప్పుడు చాలా కఠిన మైన రూల్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నాగబాబు వెళ్లిపోయిన తర్వాత.. మల్లెమాల ప్రొడక్షన్స్ సంస్థ చాలా మార్పులు తీసుకు వచ్చింది.
ఇప్పటికే నాగబాబు తర్వాత చమ్మక్ చంద్ర లాంటి కీలకమైన కమెడియన్లు మానేశారు. అయినా మల్లెమాల మాత్రం ఎక్కడా తగ్గకుండా కఠినమైన రూల్స్‌ను పెడుతోంది. దీంతో ఆర్టిస్టుల రెమ్యునరేషన్ తగ్గిపోయినట్టు సమాచారం. మొన్నటి వరకు సినిమాల్లో చేసే వారికంటే.. ఈ షోలో చేసిన వారే ఎక్కువ సంపాదిస్తున్నారనే టాక్ ఉండేది. కానీ పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ తగ్గించేశారిన తెలుస్తోంది.
Also Read: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలే ఇవే.. టాప్‌లో ఆ మూవీనే
గతంలో ఒక్కో ఎపిసోడ్‌కు రోజాకు రూ.4 లక్షలు, మనో కు రూ.2లక్షలు, అనసూయకు రూ.1.20 లక్షలు, రష్మీకి రూ.లక్ష వరకు ఇచ్చేవారు. సుధీర్ టీంకు రూ.3.5లక్షలు, హైపర్ ఆది టీమ్‌కు రూ.3లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే వారు. కానీ ఇప్పుడు టీముల రెమ్యునరేషన్ తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ టీమ్‌కు రూ.3లక్షలు మాత్రమే ఇస్తున్నారంట.
అలాగే ఆది టీమ్‌కు రూ.2.5లక్షలు, రాకెట్ రాఘవ టీమ్ కు రూ.2.5 లక్షలు, భాస్కర్ టీంకు రూ.2 లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ తగ్గించిన రెమ్యునరేషన్లే కావడం విశేషం. అలాగే చలాకీ చంటి రెమ్యునరేషన్ రూ.2 లక్షలకు పడిపోయింది. ఇవన్నీ ఆ షోకు వస్తున్న రేటింగ్స్ ఆధారంగానే ఇస్తున్నారని సమాచారం. పైగా కరోనా కారణంగా ఈ పారితోషికాలను పెంచే అవకాశం కూడా లేదని సమాచారం.
ఇప్పటికే చాలామందిని కాస్ట్ కటింగ్స్ పేరుతో తీసేశారు కూడా. ఎవరైనా డిమాండ్ చేస్తే నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోవాలంటూ చెబుతున్నారంట. దీంతో చేసేది లేక కొందరు అలాగే కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: జనసేన క్షేత్రస్థాయి బలోపేతానికి నడుం బిగించిన పవన్ కళ్యాణ్