https://oktelugu.com/

KTR Comments On AP: ఆంధ్రాపై వ్యాఖ్యలు.. దిగివచ్చిన కేటీఆర్.. జగన్ సోదరుడట..

KTR Comments On AP: అలుసు తొక్కనేల కాలు కడగనేల అన్నారు. బురదలో కాలు వేయడమెందుకు తరువాత కడుక్కోవడమెందుకు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై నిన్న తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఏపీ గురించి ఆయనకెందుకు అంత ప్రేమ అంటూ అక్కడి వారు చురకలంటించారు. ఇదేం ఎన్నికల స్టంటు కాదని ఎవరి బాధలు వారు చూసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వచ్చాయి. దీంతో స్పందించిన కేటీఆర్ తన వ్యాఖ్యలు బాధ కలిగించినందుకు బాధపడుతున్నానని […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 30, 2022 / 10:58 AM IST
    Follow us on

    KTR Comments On AP: అలుసు తొక్కనేల కాలు కడగనేల అన్నారు. బురదలో కాలు వేయడమెందుకు తరువాత కడుక్కోవడమెందుకు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై నిన్న తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఏపీ గురించి ఆయనకెందుకు అంత ప్రేమ అంటూ అక్కడి వారు చురకలంటించారు. ఇదేం ఎన్నికల స్టంటు కాదని ఎవరి బాధలు వారు చూసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వచ్చాయి. దీంతో స్పందించిన కేటీఆర్ తన వ్యాఖ్యలు బాధ కలిగించినందుకు బాధపడుతున్నానని ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. జగన్ తనకు సోదర సమానుడని పేర్కొన్నారు.

    KTR

    సంక్రాంతికి తన స్నేహితులు కొందరు అక్కడకు వెళ్లి అక్కడి పరిస్థితులు తనతో పంచుకుంటే తాను మాట్లాడానని అంతకు మించి వేరే ఉద్దేశం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇంత రాద్ధాంతం జరుగుతుందని అనుకోలేదని అన్నారు. తన వ్యాఖ్యలు వారిని బాధించినందుకు తనక కూడా బాధ కలిగిందని ట్విటర్ లో స్పందించారు. ఏపీ మంత్రులు కూడా ఇదే రేంజ్ లో కేటీఆర్ పై విమర్శల దాడికి దిగారు. మంత్రి రోజా తనదైన శైలిలో ఘాటైన విమర్శలు చేశారు.

    Also Read: BJP Dr Parthasarathi: జగన్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తాం: పార్థసారథి సంచలన ప్రకటన

    అయినా ఏ రాష్ట్రం పరిస్థితి ఆ రాష్టానికే తెలుసు. అలాంటిది మంత్రి కేటీఆర్ ఆంధ్రాలో నరకం కనిపిస్తోందని చెప్పడంతో వారిలో ఆగ్రహం పెరిగింది. మా రాష్ట్రం గురించి ఆయనకెందుకు మంట అని చాలా మంది తమ కామెంట్లు చేశారు. కేటీఆర్ ను ఉద్దేశించి పెద్ద రాజకీయ దుమారమే రేగింది. దీంతో శుక్రవారం రాత్రి కేటీఆర్ ట్విటర్ లో ఈ మేరకు పోస్టు చేసి గొడవను చల్లార్చారు.

    Roja

    ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నా మనకెందుకు. మనమేమైనా ఆరుస్తామా తీరుస్తామా వారి బాధలు వారివి. సీత బాధలు సీతవి పీత బాధలు పీతవి అన్నట్లు ఉండాలే పక్కవారి మీద నిందలు వేయడం తగదు. అందుకే కేటీఆర్ కు రాజకీయ నాయకుల చురకలు బాధ కలిగించాయి. దీంతో ఆయన దిగి వచ్చి స్పందించాల్సిన పరిస్థితి. ఎందుకు బురదలో రాయి వేస్తే ఆ బురద మనమీదే పడుతుంది. ఇకనైనా మంత్రి కేటీఆర్ అదుపులో ఉంటే ఆయనకే మంచిదనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి.

    జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెబుతున్నా టీఆర్ఎస్ నేతలు ఇక్కడే కుదురుగా ఉండలేకపోతున్నారు. అక్కడ ఇలాగే విమర్శల దాడికి దిగితే వీరికి భారీ నష్టమే. అయినా దేశ రాజకీయాలను శాసించాలంటే దానికో సత్తా ఉండాలి. లక్ష్యం కావాలి. అవేవీ లేకుండా వీరు జాతీయ రాజకీయాలు అంటూ బోర్డు పెట్టుకుని ఇక్కడే కొట్టుకుంటున్నారు.

    Also Read: Chaitra Amavasya: రేపే శని అమావాస్య.. ఈ తప్పులు చేయొద్దు.. అసలేం చేయాలంటే?

    Recommended Videos


    Tags