Anchor Sreemukhi: సోషల్ మీడియా ఎంత మేలు చేస్తుందో అంతే సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సెలెబ్రిటీలు వేధింపులకు గురవుతున్నారు. కొందరు నోటికి వచ్చిన కామెంట్స్ చేస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. తాజాగా యాంకర్ శ్రీముఖి ఫోటోలపై నెటిజెన్స్ బూతు కామెంట్స్ తో రెచ్చిపోయారు. గోల్డ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన శ్రీముఖి హాట్ ఫోజులతో ఫోటో షూట్ చేశారు. ఈ గ్లామరస్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు ఫోటోలపై బూతు కామెంట్స్ పోస్ట్ చేశారు.

ఓ నెటిజన్ దారుణంగా.. డబుల్ కోటింగ్ ఇచ్చిన బ్రెడ్ లా ఉంది. ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ బెడ్ కూడా అవసరం లేదు… అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. మరొక నెటిజెన్, ఏమెట్టి పెంచారురా బాబు.. అని కామెంట్ చేశాడు. ఈ తరహా బూతు కామెంట్స్ అనేకం శ్రీముఖి పోస్ట్ కామెంట్స్ సెక్షన్ లో ఉన్నాయి. శ్రీముఖి ఫోటోలు వైరల్ కావడంతో పాటు ఆ బూతులు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇలాంటి కామెంట్స్ లేడీ సెలెబ్రిటీలకు కామనే. కొందరు మగాళ్లు ఇలాంటి బూతు కామెంట్స్ పెడుతూ తమ పైశాచికం చాటుకుంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే కెరీర్లో ఏమీ చేయలేరు. శ్రీముఖి సైతం వాటిని పనిలేని వాళ్ళు చేసే చర్యలుగా కొట్టిపారేసి ముందుకు వెళుతుంది. నెగిటివ్ కామెంట్స్ పక్కన పెట్టి పాజిటివ్ కామెంట్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ మధ్య శ్రీముఖి ఫోటో షూట్స్ ఎక్కువయ్యాయి. ఆమె యాంకర్ గా బిజీ అయిన నేపథ్యంలో షోస్ లో ధరించే ట్రెండీ బట్టల్లో ఫోటోలు దిగి వాటిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది.

యాంకర్ గా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉండగా తెగ ఎంజాయ్ చేస్తుంది. నాలుగైదు షోలతో ఆమె బిజీగా ఉన్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీలను శ్రీముఖి దాటేసింది. పటాస్ షోతో యాంకర్ గా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకుపోతున్నారు. జాతిరత్నాలు, మిస్టర్ అండ్ మిసెస్, మా పరివార్, డాన్స్ ఐకాన్ ఇలా పలు షోస్ కి శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు.