Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ ని అడ్డంగా ఇరికించేశాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. హౌస్లో పల్లవి ప్రశాంత్ పెంచుతున్న మొక్కకు తెగులు సోకింది. ఈ క్రమంలో దానికి ఏం మందు వాడాలని అడిగాడు. పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డగా పాపులర్. తన మొబైల్ లో తాను చేసే పొలం పనుల వీడియోలు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేవాడు. అలా రైతుబిడ్డగా పాప్యులర్ అయ్యాడు. చాలా కాలంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు.
అనూహ్యంగా సీజన్ 7లో ఛాన్స్ దక్కింది. లాంచింగ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున పల్లవి ప్రశాంత్ కి ఒక మొక్కను ఇచ్చాడు. హౌస్లో దాన్ని జాగ్రత్తగా పెంచాలని చెప్పాడు. అయితే పల్లవి ప్రశాంత్ ఆ విషయం మర్చిపోయాడు. ఆ మొక్క పోషణ వదిలేశాడు. దాంతో అది చచ్చిపోయింది. నాగార్జున ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ కి క్లాస్ పీకాడు. ఒక మొక్కనే కాపాడుకోలేనివాడివి రైతుబిడ్డ ఎలా అవుతావ్? అని నిలదీశాడు.
మరో మొక్క పంపిన నాగార్జున దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గట్టిగా చెప్పాడు. నిద్ర లేచిన వెంటనే ప్రశాంత్ ఆ మొక్కకు దండం పెడతాడు. దాని బాగోగులు చూసుకుంటాడు. అది మిర్చి మొక్క కాగా దానికి తెగులు పడింది. బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ని మొక్కకు ఏమైందని అడిగాడు. పూత రాలిపోతుందని సమాధానం చెప్పాడు. దానికి ఒక స్ప్రే ఉంటుంది కొట్టాలని ప్రశాంత్ చెప్పాడు.
ఆ మందు పేరు చెబితే తెప్పిస్తానని బిగ్ బాస్ అన్నాడు. అప్పుడు రైతుబిడ్డ తడబడ్డాడు. ఆ తెగులుకు ఏం మందు వాడతారో చెప్పలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మిరపకాయ మొక్కకు తెగులు పడితే ఏ మందు కొట్టాలో తెలియదు, వీడు రైతుబిడ్డా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ నెటిజెన్స్ కి దొరికిపోయినట్లు అయ్యింది.
View this post on Instagram