Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఫినాలే లో ముగ్గురు నలుగురు సభ్యులు హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున కొందరు గెస్ట్ లని లోపలికి పంపించడం జరుగుతుంది. హౌస్ మేట్స్ కి డబ్బు ఆశ చూపించి ఎవరో ఒకరిని తప్పుకునేలా టెంప్ట్ చేస్తారు.
గత ఫైనల్స్ గమనిస్తే… ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయిన తర్వాత ఇలా డబ్బు ఆశజూపడం జరుగుతుంది. కానీ ఈ సీజన్లో ఆరంభం నుంచే హీట్ పెంచేశారు. తాజా సమాచారం ఏంటంటే .. యాంకర్ శ్రీముఖి బిగినింగ్ లోనే హౌస్ లోకి వెళ్తుంది. ఆమె రూ. 20 లక్షల నగదు ఉన్న సూట్ కేసు లోపలి తీసుకువెళ్తుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫినాలే వరకు కొనసాగుతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ పై వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.
అయితే హౌస్ లో ఆరుగురికి శ్రీముఖి రూ . 20 లక్షల డబ్బు ఆశ చూపించింది. ఎవరైనా డ్రాప్ అయితే ఆ డబ్బు వారి సొంతం అంటూ చాలా టెంప్ట్ చేసింది. కానీ ఎవరు ముందుకు రాలేదు. శ్రీ ముఖి ఇచ్చిన ఆఫర్ ని అందరూ రిజక్ట్ చేశారు. ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నామని అనుకునే వారికి ఇది గోల్డెన్ ఆఫర్ అంటూ శ్రీముఖి బాగా కవ్వించింది. కానీ ఆ ఆఫర్ తీసుకునేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపలేదు.
స్టార్టింగ్ లోనే ఈ రేంజ్ లో ఉంటె ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యే కొద్దీ ఆఫర్ పెరగడం ఖాయం. కాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు విన్నర్ అవుతారు అంటూ ఉత్కంఠగా సాగే ఫినాలే ఎపిసోడ్ భారీగా ప్లాన్ చేశారని సమాచారం. ఇక పలు మీడియా సంస్థల అనధికారిక సర్వేలలో శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్య టైటిల్ పోరని తెలుస్తుంది. ఈ ముగ్గురిలో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడట.