Bigg Boss Telugu 9: ప్రస్తుతం ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ను అందించడానికి చాలా ప్లాట్ ఫామ్స్ రెడీగా ఉన్నాయి. ఒకప్పుడు సినిమాల ద్వారానే ఎంటర్టైన్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు సోషల్ మీడియా, ఓటిటి ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఎంటర్టైన్మెంట్ ని పొందుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రియాల్టీ షోల ద్వారా కూడా చాలావరకు ప్రేక్షకులు వాళ్ల కష్టాలను మర్చిపోయి అందులో లీనమైపోయి ఆ షోస్ ని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూనే ఎంజాయ్ చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ‘స్టార్ మా’ లో గత 8 సీజన్లలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఏకైక షో ‘బిగ్ బాస్ ‘… మీదట ఈ షో కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించాడు…ఆయన తర్వాత ఈ షో కి హోస్ట్ గా నాని చేశాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత ఇప్పుడు నాగార్జున వ్యవహరిస్తున్నాడు…అయితే గత రెండు సీజన్ల నుంచి నాగార్జున మీద చాలా నెగెటివిటి పెరిగిపోతోంది. దాంతో చాలా మంది హోస్ట్ గా నాగార్జునను మార్చండి అంటూ చాలా రకాల కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఆ షోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్లకి సపోర్టుగా ఉండకుండా తనకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఆయన సపోర్టుగా మాట్లాడుతున్నారంటూ ఆయా కంటెస్టెంట్ల అభిమానులు సోషల్ మీడియా ద్వారా వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా జీ5 లో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షో కి హోస్టు గా పరిచయమైన జగపతిబాబు మొదటి ఎపిసోడ్ లోనే కింగ్ నాగార్జునను ఇంటర్వ్యూ చేసి చాలా గొప్ప ప్రశంసలను అందుకుంటున్నాడు.
Also Read: జగపతి బాబు దెబ్బకు షో నుండి పారిపోయిన హీరోయిన్ శ్రీలీల..వీడియో వైరల్!
ఇప్పటికే ఈ షో భారీ వ్యూయర్షిప్ ను దక్కించుకుంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే బిగ్ బాస్ షోకి కూడా జగపతిబాబు ని హోస్టుగా తీసుకురండి ఆ షో మరింత పాపులారిటిని సంపాదించుకుంటుంది అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…
జగపతిబాబు షో ను చాలా ఫన్నీగా, సరదా ఇన్సిడెంట్లతో ముందుకు తీసుకెళ్తున్న వైనం ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది. దాంతో పాటుగా మధ్య మధ్యలో ప్రేక్షకుడికి ఏమాత్రం బోర్ కొట్టించకుండా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ హోస్టింగ్ అంటే ఎలా ఉండాలి అనేది దానికి పర్ఫెక్ట్ ఎగ్జంపూల్ ను సెట్ చేస్తున్నాడు. అందువల్లే ఆయన హోస్టింగ్ అనేది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవుతోంది.
ఇక ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా బాలయ్య బాబు ఎంతటి క్రేజ్ ను సంపాదించుకున్నాడో జగపతిబాబు జయమ్మూ నిశ్చయమ్మురా అనే షో ద్వారా అంతకంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటాడంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే చాలామంది విమర్శకులు సైతం జగపతిబాబుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు… ఇక బిగ్ బాస్ షో కి హోస్టుగా జగపతి బాబు ను తీసుకుంటే బాగుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం…