Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన సినిమా కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకపక్క పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గెలిచినా పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా తన బాధ్యత ను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తన సినిమా కెరియర్ లో ఎన్నో రీమేక్ సినిమాలలో నటించి విజయం సాధించారు. అయితే కొంతకాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి కొంత భాగం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన దృష్టి మొత్తం రాజకీయాలపై పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక పదవుల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇవ్వనున్నట్లు దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా తేరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే తేరి సినిమాకు రీమేక్ గా హిందీలో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందు విడుదలయ్యింది. ఈ సినిమాలో సౌత్ సినిమా ఇండస్ట్రీ అందాల తార కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. బేబీ జాన్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బేబీ జాన్ సినిమా ఒరిజినల్ సినిమా అయినా తేరి కథను ఏమాత్రం మార్చకుండా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మాత్రం భారీగా భారీ బడ్జెట్ తో తీసినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హీరో పవన్ కళ్యాణ్ కూడా తేరి సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నట్లయితే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ను ఫాలోయింగ్ ఈ సినిమాలో మంచి మంచి చేంజెస్ చేస్తే బాగుంటుంది అని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.