Rajamouli: నిన్న కేంద్ర ప్రభుత్వం నేడు గణతంత్ర దినోత్సవం ని పురస్కరించుకొని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ అవార్డ్స్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో నందమూరి బాలకృష్ణ కి పద్మభూషణ్, ప్రముఖ సీనియర్ హీరోయిన్ శోభనకి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అదే విధంగా తమిళ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ప్రముఖ హీరో అజిత్ కి పద్మభూషణ్ అవార్డు ని ప్రకటించారు. ఈ అత్యున్నత పురస్కారం ని అందుకున్న ప్రతీ ఒక్కరికి సోషల్ మీడియా లో సర్వత్రా శుభాకాంక్షల వెల్లువ కురిసింది. అయితే ఈ సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి వేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘7 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు ప్రకటించడం చాలా గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మంచి మాటలే చెప్పాడు కదా, ఈ ట్వీట్ ఎందుకు వివాదాస్పదమైంది అని మీరు అనుకోవచ్చు.
అయితే ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలివుడ్, బాలీవుడ్ అనే భేదాలు లేవు. అన్ని ఇండస్ట్రీస్ ని కలిపి ఇండియన్ సినిమా అని పిలుస్తున్నారు. పర బాషా చిత్రాలు ఇక్కడికి వచ్చి దుమ్ములేపేస్తున్నాయి, అదే విధంగా మన సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతుంది, ఇలాంటి సమయంలో అంత గొప్ప స్థాయిలో ఉన్న డైరెక్టర్ బాషా బేధం చూపించడం అవసరమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. మరి కొంతమంది అయితే మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తులు కూడా పద్మ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న వాళ్ళని పేరు పేరున శుభాకాంక్షలు తెలియచేస్తే, రాజమౌళి మాత్రం పేర్లు ప్రస్తావించకుండా, సింపుల్ గా పై విధంగా స్పందించాడు. దీనికి ఆ పురస్కారాలు పొందిన ప్రముఖుల అభిమానులు మండిపడ్డారు. వారిలో బాలయ్య , అజిత్
అభిమానులు కూడా ఉన్నారు.
హీరోల పేర్లు ప్రస్తావించి శుభాకాంక్షలు తెలియచేయడం ఒక పద్దతి, ఎంత పాన్ ఇండియన్ డైరెక్టర్ అయితే మాత్రం అంత బలుపు అవసరమా?, ఎక్కడి నుండి ఎదిగాము అనేది మర్చిపోతే ఎలా అంటూ రాజమౌళి ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆయన ఫన్నీ గా మహేష్ బాబు పాస్ పోర్ట్ ని సీజ్ చేస్తూ పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. అభిమానులు ఈ వీడియో ని అనుసరిస్తూ ఎన్నో లక్షల మీమ్స్ ని క్రియేట్ చేసారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు మూడు రోజుల్లో మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టుకోబోతుంది.