Kiraak RP: జబర్దస్త్ షోలో తన కామెడీ టైమింగ్ తో, అదిరిపోయే పంచులతో నవ్వులు పూయించాడు కిరాక్ ఆర్పీ. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని వివాదాల కారణంగా నాగబాబు జబర్దస్త్ షో మానేసాడు. దీంతో ఆర్పీ కూడా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా ప్రయత్నం చేశాడు. ఓ మూవీ లాంచ్ చేసి మధ్యలో వదిలేశాడు. మల్లెమాల సంస్థ మీద విమర్శలు చేశాడు. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారమైన ఓ కామిడీ షో లో పాల్గొన్నాడు.
అవేమీ కలిసి రావడం లేదని అనూహ్యంగా కిరాక్ ఆర్పీ వ్యాపారస్తుడిగా మారాడు. నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు పేరుతో కూకట్ పల్లి సమీపంలో కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఆ వ్యాపారం భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లోని మణికొండ లో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఇటీవల వ్యాపారం ఆంధ్రాకు కూడా విస్తరించాడు. తిరుపతిలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. దీని లాంచింగ్ కు మంత్రి రోజా, హీరోయిన్ మెహ్రీన్ గెస్ట్ లుగా వచ్చారు.
కాగా నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు రుచి సెలెబ్రెటీల వరకు వెళ్ళింది. హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు చేపల పులుసు పంపినట్లు కిరాక్ ఆర్పీ స్వయంగా తెలిపారు. అంతే కాకుండా దర్శకుడు బోయపాటి శ్రీనుకు కూడా పంపారట. వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేస్తారనో లేక ఫీడ్ బ్యాక్ తెలియజేస్తారనో చేపల పులుసు పంపలేదు. వాళ్ళ నుండి మరలా చేపల పులుసు కావాలి అని ఫోన్ రావాలి. అందుకే సెలెబ్రెటీలకు చేపల పులుసు పంపినట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించాడు.
అయితే ప్రస్తుతం కిరాక్ ఆర్పీ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ప్రతి చోటా ఒక వంటశాల ఏర్పాటు చేసి రకరకాల చేపల పులుసు తయారు చేసి అమ్ముతున్నాడు. నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు రుచికి జనాలు ఫిదా అవుతున్నారు. చూస్తే రానున్న కాలంలో కిరాక్ ఆర్పీ పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసినా ఆశ్చర్యం లేదు.