Neha Sharma: నేహా శర్మ యాడ్స్ చేసే సయమంలోనే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకునేవారు. కానీ, బ్యాడ్ టైమ్.. అమ్మడికి అందం ఎంత ఉన్నా, సినిమా అవకాశాలు అంత తేలిగ్గా ఏమి రాలేదు. ఎన్నో కష్టాలు అవమానాల తర్వాత తొలి సినిమాగా ‘చిరుత’ సినిమా వచ్చింది. సినిమాని ఎంతో కష్టపడి పూర్తి చేసింది. రిలీజ్ కూడా భారీ స్థాయిలో అయింది.

ఈ సినిమా వల్ల, చరణ్ కాస్త ‘మెగా పవర్ స్టార్’ అయ్యాడు. కానీ, నేహా శర్మ మాత్రం సాధారణ స్థాయి హీరోయిన్ గా కూడా సినిమాలు చేయలేకపోయింది. మధ్యలో కొన్నాళ్ళు మలయాళ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది. హిందీలో కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది. కానీ మళ్ళీ నేహా శర్మకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చిన్నాచితకా చిత్రాలు వచ్చాయి. డబ్బులు కోసం తప్పక రెండు సినిమాలను ఒప్పుకుంది.
Also Read: Shruti Haasan: ప్రైవేట్ పార్ట్స్ సర్జరీల ‘శ్రుతి హాసన్’ క్లారిటీ.. మరి ఎఫైర్లు సంగతి ?
అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత నేహా శర్మ గురించి అందరూ మర్చిపోయారు. దానికి తోడు ఆమె చేస్తున్న కొత్త సినిమాల పై కూడా ఎలాంటి అంచనాలు లేవు. కానీ అంతలో నేహా శర్మకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అమ్మడికి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షించేసింది నేహా శర్మ. ఈ బ్యూటీ డాషింగ్ గర్ల్.
ఎంతైనా ఆమె డైరక్టర్ పూరి జగన్నాధ్ ప్రోడక్ట్ కదా. పూరినే ఆమెను మొదట హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. కానీ, గత కొన్నేళ్లుగా ఫేడ్ అవుట్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. అయితే ఉన్నట్టు ఉండి నేహా శర్మ , ప్రస్తుతం వేరే హీరోయిన్లకు కూడా పోటీ ఇచ్చే స్థాయిలో ఛాన్స్ లను ఎలా పట్టుకుంటుంది అంటే.. దీని వెనుక బిజినెస్ మెన్స్ ఉన్నారట. నేహా శర్మకు భారీ ఆఫర్లు వచ్చేలా వాళ్ళు తన పరిచయాలను ఉపయోగిస్తున్నారు.

ఎలాగూ హీరోయిన్లను స్క్రీన్ మీదకు ప్రెజెంటేషన్ చేయడంలో హిందీ దర్శకులు మాస్టర్ డిగ్రీ చేశారు. అసలే సరైన హీరోయిన్ల కోసం కిందామీదా పడుతోన్న బాలీవుడ్ మేకర్స్ దృష్టిని మొత్తానికి నేహా శర్మ బాగానే ఆకర్షిస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయట. లేటెస్ట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read:Ileana: ఓహో.. ఇలియానా పెళ్లి.. ఘనంగా ఏర్పాట్లు !
Recommended Videos: