Negative talk For Megastar Movie: ‘దర్శకుడు మారుతి డైరెక్షన్ లో నేను ఒక మూవీ చేయాలని, యూవీ విక్కీ నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నేను మారుతితో సినిమాకి ఓకే చెబుతున్నాను. మారుతి.. ఇక మన సినిమా పై నువ్వు దృష్టి పెట్టు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఈ సినిమా పై అనేక రూమర్లు నిన్నటి నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి.
దర్శకుడు మారుతి చిన్న డైరెక్టర్. పైగా మారుతి చేసే ప్రతి సినిమాలో ఒక చిన్న పాయింట్ మాత్రమే ఉంటుంది. ఆ పాయింట్ చుట్టూ కథను అల్లుకుని సినిమాలు చేస్తుంటాడు. మారుతికి తెలిసిన విద్య ఇదే. అంతేగాని మారుతిలో గొప్ప కథకుడు లేడు, అలాగే గొప్ప షాట్ మేకర్ కూడా లేడు. మరి ఇలాంటి మారుతి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఎంతవరకు న్యాయం చేస్తాడు ?, అసలు మెగాస్టార్ చిరంజీవిని మారుతి హ్యాండిల్ చేయగలడా ? ప్రస్తుతం సినీ జనంలో ఇదే చర్చ.
Also Read: TRS Supports Opposition Candidate: సంచలనం ఏమాయె సారూ.. విపక్ష అభ్యర్థికి టీఆర్‌ఎస్ మద్దతు..!!
మారుతి పై అనుమానం రావడానికి కారణం.. గతంలో వెంకటేష్ తో ఒక సినిమా చేసి వెంకీకి దారుణమైన ప్లాప్ ను ఇచ్చాడు మారుతి. అందుకే, మారుతి స్టార్ హీరోలకు పనికిరాడు అని ఓ వర్గం బాగా ప్రచారం చేస్తోంది. చిన్న,చిన్న సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొట్టే మారుతికి.. పెద్ద సినిమాలు సెట్ కావు అని బలంగా ఒక ముద్ర పడిపోయింది. మరి మారుతి ఆ ముద్రను ఎలా చెరిపేస్తాడు ?.
ఎలాగూ హిట్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి.. మారుతిని మంచి విషయం ఉన్న దర్శకుడిగా చిరు నమ్మి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే.. అందుకు తగ్గట్టుగానే మారుతి ఖాతాలో భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే లాంటి పెద్ద హిట్లు ఉన్నాయి. కాబట్టి.. మారుతి పక్కా కమర్షియల్ హిట్ డైరెక్టర్ గానే చెప్పుకోవాలి.
కానీ, అగ్ర హీరోలతో సినిమాలు చేయలేడు అనే పేరును మారుతి ఎలా పోగొట్టుకుంటాడు ? పైగా ఏకంగా.. చిరంజీవితోనే సినిమా ఓకే చేయించుకున్నాడు. మారుతి సినిమాల్లో సింగిల్ పాయింట్ ఉంటుందని, అవే కుళ్ళు జోకులు ఉంటాయని.. అప్పుడే చిరు – మారుతి సినిమా పై నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సినిమా మొదలు కాకముందే మెగాస్టార్ సినిమాకి నెగిటివ్ టాక్ బయటకు రావడం విశేషమే.
Also Read: Alia Bhatt : ఆలియాకు మూడు నెలలకే గర్భం.. మురిసిపోయిన రణబీర్.. వైరల్ ఫొటో