Homeఎంటర్టైన్మెంట్Acharya Movie: ఆచార్య మూవీ నుంచి నీలాంబరి ఫుల్ సాంగ్ రిలీజ్...

Acharya Movie: ఆచార్య మూవీ నుంచి నీలాంబరి ఫుల్ సాంగ్ రిలీజ్…

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి అభిమానులకు మరో అప్డేట్ ను ప్రకటించింది.
neelambari full song released from acharya movie
కాగా ఇప్పుడు తాజాగా ”నీలాంబరి” అనే సాంగ్ ఫుల్‌ సాంగ్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ నీలాంబరి సాంగ్ లో రామ్ చరణ్, పూజా హెగ్డే ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పాలి. రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కిన ఈ పాటలో చరణ్ స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. పూజ హెగ్డే మరోసారి తన అందంతో ఆడియన్స్ ను మరోసారి ఆకట్టుకుంటుంది. అలానే పాట లిరిక్స్‌ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటతో సినిమాకు మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన  మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్  అందించారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ఆచార్య చిత్రం విడుదల కానుంది.
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే  మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్‌ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ”, బాబీతో మరో సినిమా చేయనున్నారు.
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular