Nayanthara Shocking Decision: లేడీ సూపర్ స్టార్ నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ళు సహజీవనం తర్వాత నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. వీరి వివాహం మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, పెళ్లి కారణంగా నయన్ ఇక నటనకు స్వస్తి చెప్పబోతోంది. గతంలో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి నటనకి గుడ్ బై చెప్పనుందని టాక్ నడుస్తోంది. ఆ పై సమయాన్ని భర్తతో కెటాయించాలని నయనతార భావిస్తోందట.

ఐతే, నయనతార నిర్ణయంపై ఫ్యాన్స్ తెగ అందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె.. చిరు ‘గాడ్ ఫాదర్’ షారూఖ్ ‘జవాన్’, పృథ్వీరాజ్ ‘గోల్డ్’ సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ సినిమాల తర్వాత నిజంగానే నయనతార సినిమాలకు గుడ్ బాయ్ చెబుతుందా ? లేదా ? అనేది చూడాలి. ఇక నయనతార ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా తమ సంసారం సాఫీగా సాగడానికి నయనతార అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేసుకుంది.
ఇప్పటికే చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఇళ్లు వేద నిలయానికి సమీపంలోనే నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేయడం విశేషం. పొయెస్ గార్డెన్ లో ఎక్కువగా సినీ ప్రముఖులే నివాసముంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు ఎందరో తమిళ సినీ దిగ్గజాలు ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు.

అందుకే.. ఈ ప్రాంతంలో స్థలం చాలా ఖరీదు. అసలు ఇక్కడ స్థలాన్ని అమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. అలాంటి ప్రాంతంలో నయనతార ఏకంగా రెండు ఇళ్లు కొనుగోలు చేయడంతో ఈ టాపిక్ ఆశ్చర్యంగా మారింది. ఇంతకీ నయనతార కొనుగోలు చేసిన ఇల్లు విస్తీరణం ఎంతో తెలుసా ?.. అక్షరాల ఎనిమిది వేల చదరపు అడుగులు. ఇక నయనతార కొన్న ఒక్కో ఇంటి ఖరీదు ఎంతో తెలుసా ? 26 కోట్ల రూపాయలు. అంటే.. రెండు ఇల్లులు కలిపి 52 కోట్లు.
ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె ఏమి మాట్లాడినా ఎప్పుడు హాట్ టాపికే అవుతుంది. నిజానికి నయనతార వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలున్నాయి. మొత్తానికి.. ప్రేమ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న నయనతార.. దాంపత్య జీవితంలో మాత్రం విఘ్నేష్ శివన్‌తో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుందాం.