‘లేడీ సూపర్ స్టార్ నయనతార’ మొదటిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోందని, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని.. ఈ సినిమాకి డైరెక్టర్ అట్లీ అని గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో షారుఖ్ పాత్ర ద్విపాత్రాభినయం, అంటే సీనియర్ షారుఖ్ సరసన ఈ సౌత్ లేడీ సూపర్‌స్టార్ నటిస్తోందట.
ఇప్పటికే నయనతార కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఇప్పటికైతే ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి, ఈ వార్తలను నిజమని నమ్మలేం. అయితే నయనతార గతంలో అట్లీతో ‘రాజారాణి’ సినిమా చేసింది, అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అట్లీ కోరితే నయన్ కాదనదు.
పైగా షారుఖ్ తో నటించే ఛాన్స్ అంటే.. నయనతార కెరీర్ కే దక్కిన అరుదైన గౌరవం. కాబట్టి, అవకాశం వస్తే.. కచ్చితంగా నయనతార బాలీవుడ్ ఎంట్రీను వద్దు అనుకోదు. కాబట్టి ఎక్కువ శాతం నయనతార ఈ సినిమా చేసే అవకాశం ఉంది. ఇక నయన్ అంటేనే భారీ రెమ్యునరేషన్.. అన్నిటికి మించి నయనతార అంటే.. సౌత్ టాప్ హీరోయిన్.. ఆమె సినిమాలకు క్రేజీ ఓపెనింగ్స్ వస్తాయి.
ఇవన్నీ ఉన్నాయి కాబట్టే.. నయనతార హిందీ డెబ్యూ పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఎలాగూ బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని, నయనతార రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను అడిగిందట. అట్లీ – షారుఖ్ సినిమా కాబట్టి, రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గరు. ఇక ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.