
Nayanthara: లేడీ సూపర్ స్టార్ ‘నయనతార’ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే నయనతార తన కాబోయే భర్త పుట్టిన రోజును ఘనంగా జరిపించింది. చెన్నైలోని తన ప్లాట్ లోనే విఘ్నేష్ శివన్ కి గ్రాండ్ గా బర్త్ డే పార్టీ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఇక బాయ్ ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా అతను ఊహించని గిఫ్ట్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది.
ఇక నయనతార ఇచ్చిన సర్ ప్రైజ్ లకు విఘ్నేష్ శివన్ కూడా థ్రిల్ అయిపోయాడట. అందుకే స్పెషల్ గా నయనతారకి “థాంక్యూ బంగారూ” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఇక నయనతార తన కోసం ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీ ఏర్పాట్లుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ జంట త్వరలోనే ఒకటి కానుంది. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది.
ఇక తన ప్రియుడు గురించి నయనతార రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విఘ్నేశ్ చాలా మంచివాడు, అతని మనసు చాలా మంచిది, తనతో ఉంటే నాకు అసలు టైమ్ కూడా తెలియదు. తన వల్లే నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను’ అంటూ మొత్తానికి నయనతార కూడా తన ప్రియుడు గురించి గొప్పగా చెబుతూ తెగ సిగ్గు పడిపోయింది.
ఇక నవంబర్ లో వీరి పెళ్లి ఉంటుందట. నయనతార కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఎప్పటి నుంచో ఆమె పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి నయనతారను త్వరలోనే పెళ్లి కూతురిగా చూడబోతున్నాం. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార’ మొదటిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.