Nayanthara shares cryptic lost post
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆమె వరుస సోషల్ మీడియా పోస్ట్స్ అనుమానాలకు తావిస్తున్నాయి. నయన్ తన భర్త విగ్నేష్ శివన్ ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అన్ ఫాలో చేసిన విషయం తెలిసిందే. దీంతో నెటిజన్స్ పలు విధాలుగా స్పందించారు. కొందరు టెక్నికల్ ఇష్యూ లేక పొరపాటున అలా చేసి ఉంటుందని అన్నారు. మరి కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుంది అందుకే నయనతార తన భర్తని అన్ ఫాలో చేసిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక స్టార్ హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ నయనతార కి ఉంది. తమిళ్ ఇండస్ట్రీలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సౌత్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది. ఇటీవల బాలీవుడ్ మూవీ జవాన్ లో నటించింది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయం అందుకుంది. నయనతార కొద్దిరోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టింది. అకౌంట్ ఓపెన్ చేసి తొలి పోస్ట్ లో తన కవల పిల్లల ఫోటోలు షేర్ చేసింది.
కాగా లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. అభిమానులు ఆమె పై ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం నయన్ కి ఇన్స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీ గురించి, సినిమాలు, ఇంకా తన బిజినెస్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. తన భర్తను ఇన్ స్టాలో ఫాలో అవుతూ వస్తుంది. కానీ సడెన్ గా అన్ ఫాలో చేసింది. ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చింది. విగ్నేష్ శివన్ ని తిరిగి ఫాలో చేసింది.
ఈ విషయాన్ని మర్చిపోక ముందే నయనతార మరో షాక్ ఇచ్చింది. నేను ఓడిపోయాను అంటూ అనుమానాస్పద పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో నయనతార ఏం చెప్పాలి అనుకుంటుంది. నిజంగా విగ్నేష్ తో మనస్పర్థలు మొదలయ్యాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. 2022 విగ్నేష్-నయనతార పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు కవలలు కూడా పుట్టారు. విగ్నేష్ దర్శకత్వంలో నయనతార ఎల్ ఐ సీ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది.
Web Title: Nayanthara shares cryptic lost post amid divorce rumours
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com