
Nayanthara: స్టార్ లేడీ నయనతార నేచర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైకి సాఫ్ట్ గా, కూల్ గా కనిపించే నయనతార చాలా బోల్డ్ గా ఉంటారు. ఇష్టమైంది చేయడం, మనసుకు నచ్చినట్లు బ్రతకం ఆమె నైజం. పరిశ్రమలో అడుగుపెడుతూనే నయనతార ఎఫైర్ స్టార్ట్ చేశారు. హీరో శింబుతో ఘాడమైన ప్రేమ కథ నడిపారు. ఏళ్ల తరబడి ప్రేమించుకోగా వీరి ప్రైవేట్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. శింబుతో దాదాపు వివాహమే అని ప్రచారం జరిగింది. అనూహ్యంగా శింబుకి బ్రేకప్ చెప్పేసింది.
Also Read: Ashu Reddy: చెప్పుతో కొడతా అన్న అషురెడ్డి… ఇంతకీ ఏమైంది?
నెక్స్ట్ అందరికీ షాక్ ఇస్తూ పెళ్ళై పిల్లలున్న ప్రభుదేవాకు దగ్గరైంది. ఇద్దరూ పబ్లిక్ గా చట్టపట్టాలేసుకు తిరిగారు. ప్రభుదేవాతో నయనతార తన బంధాన్ని అధికారికంగా కొనసాగించింది. నయనతారను వివాహం చేసుకునేందు ప్రభుదేవా భార్యకు విడాకులు ఇచ్చాడు. ప్రభుదేవా భార్య రామలత నయనతారపై దుమ్మెత్తిపోసింది. అయితే ప్రభుదేవాతో బంధం కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు. త్వరలో పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుండగా… ఇద్దరూ విడిపోయారు.
ఇక 2015 నుండి దర్శకుడు విగ్నేష్ శివన్ కి దగ్గరయ్యారు. విగ్నేష్ దర్శకత్వంలో నయనతార నానుమ్ రౌడీ దాన్ మూవీలో నటించారు. ఆ చిత్ర సెట్స్ లో ఇద్దరికీ అవగాహన కుదిరింది. ఏళ్ల తరబడి వీరి రిలేషన్ నడిచింది. పెళ్లి కాకుండానే దంపతుల మాదిరి వ్యవహరించారు. 2022లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. గత అనుభవాల రీత్యా కనీసం విగ్నేష్ తో అయినా పెళ్లి వరకూ వెళుతుందా అనే సందేహాలు కలిగాయి. పెళ్లి కావడమే కాకుండా సరోగసీ పద్దతిలో ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు.

పెళ్ళై పిల్లలున్నా భర్త అనుమతితో నటిగా కొనసాగుతున్నారు. అయితే నయనతార పబ్లిక్ లో షారుక్ ఖాన్ కి ముద్దు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. షారుక్ కి జంటగా నయనతార జవాన్ మూవీ చేస్తున్నారు. అట్లీ దర్శకుడు కాగా… చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో షారుక్ ఖాన్ ని నయనతార ఇంటికి ఆహ్వానించారు. ఆతిథ్యం ముగిశాక తిరిగి వెళుతుండగా కారులో ఉన్న షారుక్ ఖాన్ కి నయనతార ముద్దు పెట్టింది. మీడియా వాళ్ళు ఆ దృశ్యాన్ని బంధించారు. నయనతార మర్యాదపూర్వకంగా చేసిన ఆ పని విమర్శల పాలు అవుతుంది.
Also Read: NTR 30: ఎన్టీఆర్ 30పై ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్!
The way Shah Rukh kissed Nayanthara goodbye @iamsrk you have my whole heart 😭❤️ #Nayanthara #Jawan pic.twitter.com/0zoBaBQGMP
— Samina ✨ (@SRKsSamina_) February 11, 2023