Nayanthara remuneration: ‘డాకు మహారాజ్’ వంటి భారీ హిట్ తర్వాత బాలకృష్ణ(Nandamuri Balakrishna) నుండి ‘అఖండ 2’ ఈ ఏడాది డిసెంబర్ 5 న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన గోపిచంద్ మలినేని(Gopichand Malineni) తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వీరసింహా రెడ్డి’ చిత్రం వచ్చింది. 2023 సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా, మూవీ లవర్స్ కి కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ నుండి మరో సినిమా రాబోతుంది అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఏర్పడుతాయి. షూటింగ్ ప్రారంభం కాకముందు నుండే ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా మొదలయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార ఫిక్స్ అయ్యినట్టు సమాచారం. గతం లో ఈమె బాలయ్య తో కలిసి ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడవ సినిమా వస్తోంది. ఇప్పటికే నయనతార మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె పది కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుందట. కానీ బాలయ్య, గోపీచంద్ సినిమా కోసం ఆమె కేవలం 7 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్టు సమాచారం. చిరంజీవి సినిమాకు బాలయ్య సినిమా కంటే ఎక్కువ క్రేజ్ ఉండడం, దానికి బిజినెస్ భారీగా జరుగుతుండడంతో నయనతార కూడా అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.