NTR Prashanth Neel movie stopped: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికి తమ నటనతో ప్రేక్షకులను అలరించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అతనికి మంచి విజయాలను సాధించి పెడుతున్నాయి. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన సినిమాలతో గొప్ప విజయాలను అందుకుంటున్నారు.అలాగే పాన్ ఇండియాలో ఆయన భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. దాంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. గత వారం రోజుల నుంచి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే రూమర్స్ వస్తున్నాయి.
ఈ సినిమా అవుట్ పుట్ అంత బాగా రాలేదని దానివల్ల ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మధ్య చిన్న విభేదాలు కూడా వచ్చాయనే కథనాలు వెలువడ్డాయి. మొత్తానికైతే ఈ సినిమా ఆగి పోలేదని మరో రెండు రోజుల్లో ఆఫ్రికాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని చిత్రీకరించే పనిలో దర్శక నిర్మాతలు చాలా బిజీగా ఉన్నారని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఇంతకుముందు చేసిన కేజిఎఫ్, సలార్ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం అవుట్ పుట్ మీద ఇద్దరు అంత సాటిస్ఫైడ్ గా లేరని వార్తలైతే వస్తున్నాయి. కానీ అవి ఏవి నిజం కాదని తొందరలోనే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ని వదిలి సినిమా వరల్డ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉన్నారట.
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తోంది.తద్వారా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడా? అలాగే ఎన్టీఆర్ సైతం ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేసిన హీరోగా వెలుగొందుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…