https://oktelugu.com/

Keerthy Suresh : స్టార్ హీరోయిన్ మాజీ లవర్ పై మనసు పారేసుకున్న కీర్తి సురేష్… ఆ ఛాన్స్ వస్తే అసలు వదులుకోదట!

కీర్తి సురేష్ తనకు ఇష్టమైన హీరో పేరు చెప్పింది. ఆయన ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఓ స్టార్ హీరోయిన్ తో ఏళ్ల తరబడి ఎఫైర్ నడిపాడు సదరు హీరో. ఆమెతో బ్రేకప్ తర్వాత మరో ఇద్దరు హీరోయిన్స్ ని కూడా లైన్లో పెట్టాడు. మరి కీర్తి సురేష్ కి నచ్చిన ఆ హీరో ఎవరో చూద్దాం...

Written By:
  • S Reddy
  • , Updated On : August 2, 2024 / 07:22 PM IST
    Follow us on

    Keerthy Suresh : కీర్తి సురేష్ సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన సినిమా ‘ రఘు తాత ‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ సినిమాను ప్రమోట్ చేస్తూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో వ్యక్తిగత, వృత్తిపరమైన పలు ఆసక్తి విషయాలు పంచుకున్నారు. ఆమెకు ఓ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమని మనసులో మాట బయట పెట్టింది.

    నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. తొలి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ తర్వాత నాని తో నేను లోకల్ సినిమాలో నటించింది. అనంతరం మహానటి సినిమాలో సావిత్రిగా నటించే అరుదైన ఆఫర్ అందుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ని నేషనల్ అవార్డు వరించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ ఏడాది ‘ బేబీ జాన్ ‘ మూవీతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

    ఇది ఇలా ఉంటే .. కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరని యాంకర్ అడిగారు. దానికి కీర్తి సురేష్ అసలు ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. తనకు హీరో శింబు అంటే చాలా ఇష్టం అని కీర్తి చెప్పింది. అంతేకాదు శింబు కి జంటగా నటించాలని ఉందని తెలిపింది. ఒక్క సినిమాలో అయినా శింబు తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ మనసులో మాట బయటపెట్టింది.

    ఇక్కడ విషయం ఏమిటంటే శింబుకి పరిశ్రమలో ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. హీరోయిన్ నయనతారతో శింబు కొన్నాళ్ళు ఎఫైర్ నడిపాడు. వీరి ప్రైవేట్ ఫోటోలు సైతం లీక్ అయ్యాయి. ఆమెతో బ్రేకప్ అయ్యాక హీరోయిన్ హన్సికతో ప్రేమాయణం సాగించాడని కథనాలు వెలువడ్డాయి. హీరోయిన్ త్రిష సైతం శింబు గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉందని అంటారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ తన ఫేవరేట్ హీరో శింబు అని చెప్పడం చర్చకు దారి తీసింది.

    కాగా ‘ రఘు తాత ‘ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అసలు హిందీ రాని ఓ తమిళ అమ్మాయిగా కీర్తి సురేష్ కనిపించనుంది. రవీంద్ర విజయ్, ఆనంద్ సామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ‘ రఘు తాత ‘ మూవీ రూపొందింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

    ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీ మూవీ ‘ బేబీ జాన్ ‘ లో హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తెలుగులో సుహాస్ కి జంటగా ‘ ఉప్పు కప్పు రంబు ‘ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవనుంది. అంతేకాకుండా రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా కీర్తి సురేష్ సైన్ చేసింది.