Nayantara- Vegnesh: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు నెలల క్రితం తన ప్రియుడు సతీష్ విఘ్నేష్ ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..కోలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరో శింబు మరియు ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం నడిపిన ఈమె చివరికి విఘ్నేష్ ని పెళ్లాడింది..పెళ్ళైన నాలుగు నెలలలోనే వీళ్లిద్దరికీ కవలపిల్లలు పుట్టారంటూ నయన్ భర్త సతీష్ విగ్నేష్ ఇటీవలే ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ప్రకంపనలు రేపింది..నాలుగు నెలల్లోనే పిల్లలు పుట్టడం ఏమిటిది అనే దానిపై ఆరాలు తీస్తే సరోగసి పద్దతి ద్వారా వీళ్లిద్దరు సంతానం ని పొందినట్టు తెలుస్తుంది.

సరోగసి ప్రక్రియ ని భారత దేశ ప్రభుత్వం చట్టరీత్య నేరంగా పరిగణిస్తూ కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటేనే ఈ సరోగసి పరిక్రియ చేయించుకోవడానికి అర్హులు అంటూ ఒక చట్టం ప్రవేశ పెట్టింది..అయితే దానికి విరుద్ధంగా నయన్ దంపతులు సరోగసి ప్రక్రియ ద్వారా పిల్లల్ని కనడం పై ప్రభుత్వం వివరణ కోరింది.
విఘ్నేష్ తో తనకి 6 ఏళ్ళ క్రితమే పెళ్లయిందని..ఇప్పుడు కేవలం బహిరంగంగా పెద్దల సమక్షం లో మరోసారి పెళ్లి చేసుకున్నామని కోర్టు కి నయనతార వివరణ ఇచ్చినట్టు సమాచారం..దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆమె అందచేయడం తో ఈ విషయం అక్కడితో సర్దుకుంది..కానీ నయనతార జీవితం లో మాత్రం ఈ సంఘటన ఆమె వ్యక్తిగత కుటుంబం లో అనేక వివాదాలకు దారి తీస్తుంది..విఘ్నేష్ తల్లితండ్రులు సరోగసి ద్వారా జనించిన ఆ ఇద్దరు బిడ్డలు తమ వంశాంకురం కాదని చెప్పిందట..దీనితో నయనతార బాగా హర్ట్ అయ్యినట్టు సమాచారం.

విఘ్నేష్ తో పెళ్ళైన తర్వాత నయనతార తన విలువైన ఆస్తులన్నీ కూడా భర్త పేరిట రాసిందట..ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ని ఆమె రద్దు చేసినట్టు కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట..అంతే కాకుండా నయనతార కూడా భర్త విఘ్నేష్ కి దూరంగా తన పిల్లలని తీసుకొని వెళ్లిపోయిందట..అంటే వీళ్లిద్దరు కూడా త్వరలోనే విడిపోబోతున్నారా..లేదా గొడవని సర్దుబాటు చేసుకొని మళ్ళీ కలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.