Prabhu Deva: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ జంట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఇక పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోయారు. అయితే ఇన్నాళ్లకు నయనతార – ప్రభుదేవా బ్రేక్ అప్ కి అసలు కారణం బయట పడింది. నయనతార కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ ఫుల్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ స్టార్ గా ఎదిగింది. తమిళంలో నయనతారకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్టార్ హీరోలతో సమానంగా ఆమెకు అభిమానులు ఉన్నారు.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్. అలాగే బడా హీరోలతో నటిస్తూ అగ్ర కథానాయిక గా చక్రం తిప్పుతుంది. కానీ ప్రేమ విషయంలో నయనతార రెండుసార్లు విఫలం అయింది. మొదట శింబు తో ప్రేమలో పడింది. అది వర్కౌట్ అవ్వలేదు. బ్రేకప్ తర్వాత ప్రభుదేవా కి దగ్గరైంది. ప్రభుదేవా ని ఘాడంగా ప్రేమించింది. 2009లో ప్రభుదేవా-నయనతార రిలేషన్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అనంతరం తమ రిలేషన్ ని ఇద్దరూ బహిర్గతం చేశారు.
ప్రభుదేవాతో లవ్ పీక్స్ లో ఉన్నపుడు నయనతార అతని పేరు ఎడమ చేతిపై టాటూ గా కూడా వేయించుకుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. అప్పటికే ప్రభుదేవాకు పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ నయనతార కోసం భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ విషయంలో ప్రభుదేవా భార్య రామలత న్యాయపోరాటం చేసింది. త్వరలో నయనతార – ప్రభుదేవా పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయానికి బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.
వీరి బ్రేకప్ కి ప్రభుదేవానే కారణం అనేది తాజా వాదన. ప్రభుదేవా పెట్టిన కండిషన్స్ భరించలేక నయనతార ఆయనకు దూరం అయింది అని తెలుస్తుంది. నయనతార పై ప్రభుదేవా ఆధిపత్యం చూపించేవారట. ఆమెకు చాలా ఆంక్షలు పెట్టేవాడట. క్రిస్టియన్ గా ఉన్న నయనతారను మతం మార్చుకోవాలని ప్రభుదేవా కోరాడట. అందుకు ఆమె ఓకే చెప్పిందట. పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని మరో కండిషన్ పెట్టాడట. కానీ అందుకు నయనతార అంగీకరించలేదట.
ప్రభుదేవా ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిందట. పైగా తన మొదటి భార్య పిల్లలు మనతోనే ఉంటారు అని ప్రభుదేవా చెప్పడం వీరు విడిపోవడానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ప్రభుదేవా తీరుకు భయపడి నయనతార అతనికి బ్రేకప్ చెప్పేసిందట. ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం 2015లో కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో లవ్ లో పడింది. దాదాపు 7 ఏళ్ళు వీరు డేటింగ్ చేశారు. ఇక 2022లో వివాహం చేసుకున్నారు. సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.
నయనతార కెరీర్ విషయానికి వస్తే .. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన టెస్ట్, మున్నాం గట్టి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అలాగే అమ్మోరు తల్లి మూవీ కి సీక్వెల్ గా వస్తున్న మూకుత్తి అమ్మాన్ 2 కోసం రెడీ అవుతుంది. నయనతార దంపతులు సరోగసి పద్దతిలో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు.