Homeక్రీడలుVinesh Phogat: నువ్వు మారిపోయావ్.. నీకు ఎదుగుదలకు కారణమైన వారిని మర్చిపోయావ్.. వినేశ్ పై ఆమె...

Vinesh Phogat: నువ్వు మారిపోయావ్.. నీకు ఎదుగుదలకు కారణమైన వారిని మర్చిపోయావ్.. వినేశ్ పై ఆమె బావ సంచలన ఆరోపణలు

Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ ఒలంపిక్స్ కుస్తీ పోటీలలో ఆకాశమే హద్దుగా ప్రదర్శన చేసింది. ఫైనల్ వెళ్లిన భారత మల్ల యోధురాలుగా రికార్డు సృష్టించింది. ఫైనల్ పోటీలలో 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో అనర్హతకు గురైంది. ఈ క్రమంలో ఆమె తన బాధను వ్యక్తీకరిస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది. అది చాలామంది హృదయాలను ద్రవింపజేసింది. అయితే ఇందులో ఆమె ఎదుగుదలకు కీలకమైన వ్యక్తి పేరు ప్రస్తావించకపోవడంతో వినేశ్ సోదరి గీతా ఫొగట్ భర్త పవన్ సరోహా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

పవన్ సరోహా వినేశ్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ను ఉద్దేశిస్తూ స్పందించారు. ఇది స్పోర్ట్స్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్ లో సత్తా చాటింది.. ఫైనల్ లో 100 గ్రాముల బరువు అధికంగా ఉండటం వల్ల తిరస్కారానికి గురైంది. ఈ నేపథ్యంలో దేశం యావత్తు మొత్తం ఆమె వెంట నిలిచింది. కాస్ లో వినేశ్ ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెకు ఊరట లభించలేదు. రజతం లభిస్తుందని భావించినప్పటికీ.. తీర్పు ఆమెకు అనుకూలంగా రాలేదు.

కాస్ తీర్పు అనుకూలంగా రాకపోవడంతో వినేశ్ పారి స్పోర్ట్స్ విలేజ్ నుంచి ఇండియాకు తిరుగు ప్రయాణమైంది. శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు భార్య తన స్వాగతం పలికారు. అంతకుముందు వినేశ్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. తన కెరియర్ కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. తన భర్త తోడ్పాటు, కుటుంబ సహకారం, శిక్షకులు అందించిన శిక్షణ వాటి విషయాలను ఆమె వెల్లడించింది. ఇది సమయంలో ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ గురించి ప్రస్తావించలేదు. అయితే ఇదే విషయాన్ని వినేశ్ ఫొగాట్ సోదరి భర్త, రెజ్లర్ పవన్ సరోహా ప్రముఖంగా ప్రస్తావించారు. ” వినేశ్ మీ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో నువ్వు మహావీర్ విషయాన్ని ప్రస్తావించలేదు. ఆయనను పూర్తిగా మర్చిపోయినట్టున్నావ్. నీ కుస్తీ కెరియర్ కు పునాది వేసింది మహావీర్. ఈ సమయంలో నీవు ఆ దేవుడి ద్వారా స్వచ్ఛమైన తెలివిని పొందాలని భావిస్తున్నానని” పవన్ పోస్ట్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది అయితే కొంతమంది నెటిజన్లు “గతంలో బబిత ఫొగాట్ కు ఇలానే తెలివి ఇవ్వాలని మీరు చెప్పారా? ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? మీరు ఆమెకు అండగా ఉండకపోయినప్పటికీ పర్వాలేదు. కానీ ఇలా విమర్శలు చేయకండి. అది సరైన పద్ధతి కాదు. ఆమె ఇప్పటికే చాలా కోల్పోయింది. చివరికి తన కెరీర్ కి కూడా ముగింపు పలికింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version