Allu Arjun Puspha 2: గత ఏడాది డిసెంబర్ నెల లో విడుదల అయినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే పుష్ప మేనియా ఇప్పటికి కూడా తగ్గలేదు అనే చెప్పాలి..క్రికెటర్స్ దగ్గర నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు ఈ సినిమాలోని డైలాగ్స్ పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..మేకర్స్ ఊహించిన దానికి మించే ఈ సినిమా సంచలన విజయం సాధించడం తో, పుష్ప ది రూల్ సినిమా పై షూటింగ్ ప్రారంభం కాకముందే కనివిని ఎరుగని రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి..ఆ అంచనాలను అందుకునే విధంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ని తీర్చి దిద్దుతున్నాడట సుకుమార్..ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి ఇటీవల సోషల్ మీడియా లో రోజుకో వార్త ప్రచారం అవుతూనే ఉంది..ఇప్పుడు గత రెండు రోజుల ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గురించి ప్రచారం అవుతున్న ఒక్క వార్త ఇప్పుడు ఇప్పుడు సెన్సషనల్ గా మారింది.
Also Read: Nara Lokesh Zoom Meeting: లోకేష్ కు లైవ్ లో షాకిచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా లో అల్లు అర్జున్ 55 ఏళ్ళు నిండిన పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది..ఆయన కొడుకుగా అల్లు అర్జున్ యంగ్ రోల్ ఉంటుంది అని టాక్..తండ్రి కొడుకులుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడు అట..చాలా వైవిధ్యమైన సన్నివేశాలతో పార్ట్ 1 కంటే పది రెట్లు మెరుగ్గా ఈ సినిమాని తెరకెక్కిస్తాను అని డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కి మాట ఇచ్చాడు అట..ఇక రెండవ భాగం లో రష్మిక, సునీల్ మరియు అనసూయ పాత్రలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అట..పార్ట్ 1 పార్ట్ 2 కి కేవలం టీజర్ లాంటిది మాత్రమే అని..పార్ట్ 2 అనేక మలుపులతో సుకుమార్ ఎవ్వరు ఊహకి అందని విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట..అభిమానులందరూ ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుందో అని ఎదురు చూస్తున్నారు..కానీ లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ఏమిటి అంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి మరింత ఆలస్యం అవుతుంది అని..ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది..బాహుబలి మరియు kgf సినిమాల సీక్వెల్స్ కోసం జనాలు ఎలా అయితే ఎదురు చూసారో..పుష్ప సినిమాకి కూడా అదే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు..మరి వారి ఎదురు చూపులకు తగట్టుగా ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తాడో లేదో చూడాలి.
Also Read: Naga Chaitanya: ఇష్టం లేకపోయినా నాగ చైతన్య తో బలవంతంగా సంతకాలు పెట్టించిన సమంత