https://oktelugu.com/

Star Heroine: స్టార్ హీరోయిన్ ప్రేమ పాఠాలు.. కుర్రాళ్ళ ఉత్సాహం

Star Heroine: జీవితానుభ‌వంతో వాస్త‌వాలు చెప్పే అర్హత పెద్ద‌ల‌కే కాదు, ఎందర్నో హ్యాండిల్ చేసిన భామలకు కూడా ఉంటుంది. ఇప్పుడా కోవ‌లో స్టార్ హీరోయిన్ నయనతార కూడా చేరింది. నయన్ వ‌య‌సు చిన్న‌దైనా, ఆమెకు చాలా జీవితానుభ‌వాలు ఉన్నాయి. నయనతార జీవితంలో అనేక కోణాలున్నాయి. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ‌ వ్యవహారాలతో చాలా నలిగిపోయింది ఆమె. ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తాను, సెట్ కాదు అనుకుంటే అంతే నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తాను అంటూ ఆ మధ్య ఎప్పుడో నయనతార ఓపెన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 10, 2022 / 03:39 PM IST
    Follow us on

    Star Heroine: జీవితానుభ‌వంతో వాస్త‌వాలు చెప్పే అర్హత పెద్ద‌ల‌కే కాదు, ఎందర్నో హ్యాండిల్ చేసిన భామలకు కూడా ఉంటుంది. ఇప్పుడా కోవ‌లో స్టార్ హీరోయిన్ నయనతార కూడా చేరింది. నయన్ వ‌య‌సు చిన్న‌దైనా, ఆమెకు చాలా జీవితానుభ‌వాలు ఉన్నాయి. నయనతార జీవితంలో అనేక కోణాలున్నాయి. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ‌ వ్యవహారాలతో చాలా నలిగిపోయింది ఆమె. ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తాను, సెట్ కాదు అనుకుంటే అంతే నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తాను అంటూ ఆ మధ్య ఎప్పుడో నయనతార ఓపెన్ గానే సెలవిచ్చింది.

    Star Heroine

    పైగా జీవితమంటే అదే అంటుంది. అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు అని, అనుకోనివి జ‌ర‌గ‌కుండా ఆగ‌వు అని.. కాబట్టి ప్రేమను పంచుకుంటూ పోవడమే నయనతార ఫిలాసఫీ అట. ఏది ఏమైనా తన ప్రేమ క‌ల‌లా ఎన్నిసార్లు జ‌రిగిపోయినా.. మళ్ళీ మళ్లీ తన ప్రేమ స్వప్నాలను బిల్డ్ చేసుకుంటూనే ఉంది. తాజాగా నయనతార ఓ మలయాళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఘాటు విషయాలను త‌న‌ధైన శైలిలో కుండ‌బ‌ద్ధ‌లు కొట్టింది.

    Also Read: Bride Marries Sister’s Groom : తాళి కట్టే వేళ కరెంట్ కట్: పీటలపై మారిపోయిన వరుడు

    అసలు ఇలాంటి కుండలు బద్దలు కొట్టడంలో తన తర్వాతే ఎవరైనా అంటుంది నయనతార. ఇంతకీ ఈ ప్రేమల మహారాణి చెప్పిన సంగతులను ఆమె మాటల్లోనే విందాం. ‘ప్రేమలో నిజాలు అరుదుగా బయటకు వస్తాయి. కానీ, ప్రేమ ఎప్పుడూ అబద్ధాల మీద ఆనందంగా ఉంటుంది. అంతేకాదు అబద్ధాలనే ప్రేమికులు ఎక్కువగా నమ్ముతారు’ అంటూ నయనతార ప్రేమ పాఠాలు చెప్పింది.

    Nayanthara

    నయనతార ఈ కామెంట్స్ చేయ‌డానికి ఆమె గత నేప‌థ్యమే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ప్రేమ జీవితంలో అబ‌ద్ధాల ప్ర‌చారంతో దెబ్బ‌తిన్న బాధితురాలిగా నయనతారను గుర్తిస్తున్నారు నెటిజ‌న్లు. ఇక నయనతారతో దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లి.. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. గత ఏడేళ్లుగా అతనితో సక్సెస్ ఫుల్ గా డేటింగ్ ను కొనసాగిస్తోంది నయనతార.

    కానీ, అతన్ని మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. అదేమిటి అంటే ? ఎన్నో ప్రేమ ఘాట్లు చేసిన గాయాలను తాను మర్చిపోలేక ఇబ్బంది పడుతున్నాను అని అంటుంది. మరి నయనతార ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి నాని పోతూ ఉంది. ఈ నాని పోవడాలు మునిగి పోవడాలు నయనతారకు కొత్తేమి కాదు కదా. అదే విఘ్నేష్ శివన్ భయం. ఈ ప్రేమను నయనతార ఎటు తీసుకువెళ్తుందో చూడాలి.

    Also Read:Vijay Deverakonda Triple Role: ఉఫ్.. ‘చిరంజీవి – ఎన్టీఆర్’లనే కొట్టగలడా ?

    Tags