Vijay Deverakonda Triple Role: ఉఫ్.. ‘చిరంజీవి – ఎన్టీఆర్’లనే కొట్టగలడా ?
Vijay Deverakonda Triple Role: ద్విపాత్రాభినయం చేసి మెప్పించిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ, ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో తెలుగు హీరో కూడా చేరబోతున్నాడు. ‘విజయ్ దేవరకొండ’ త్వరలోనే త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. గతంలో ‘గీత గోవిందం’ లాంటి క్లీన్ హిట్ అందించిన పరుశు రామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చర్చ జరిగింది. […]

Vijay Deverakonda Triple Role: ద్విపాత్రాభినయం చేసి మెప్పించిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ, ట్రిపుల్ రోల్స్ చేసిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో తెలుగు హీరో కూడా చేరబోతున్నాడు. ‘విజయ్ దేవరకొండ’ త్వరలోనే త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. గతంలో ‘గీత గోవిందం’ లాంటి క్లీన్ హిట్ అందించిన పరుశు రామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది.

Vijay Deverakonda
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చర్చ జరిగింది. పరుశు రామ్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చైతుతో సినిమా చేయనున్నాడు. చైతు సినిమా తర్వాత విజయ్ తో సినిమా ఫిక్స్ అయ్యాడు. ఈ సినినిమాలోనే విజయ్ దేవరకొండ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ‘గీత గోవిందం’లో కూల్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు.
పైగా ఫ్యామిలీ మేన్ గా విజయ్ దేవరకొండ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. అయితే, కొత్త సినిమాలో మాత్రం షేడ్స్ కావంట, ఏకంగా 3 కొత్త పాత్రలే ఉంటాయట. పైగా ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు దిల్ రాజు బ్యానర్ కూడా నిర్మాణ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు.

Vijay Deverakonda
ఈ మేరకు ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పరుశు రామ్ తో కూడా అగ్రిమెంట్లు పూర్తి చేసుకున్నాయి సదరు ప్రొడక్షన్ హౌస్ లు. ప్రస్తుతం లైగర్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విజయ్ దేవరకొండ, త్వరలోనే ‘శివ నిర్వాణ’తో మరో సినిమాను కూడా పూర్తిచేయబోతున్నాడు. ఆ తర్వాత మళ్లీ పూరితో ‘జనగణమన’ సినిమాని స్టార్ట్ చేశాడు.
ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ ట్రిపుల్ రోల్స్ సినిమాని పట్టాలెక్కిస్తాడట. అన్నట్టు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తుంది. ఐతే, నిన్నటి తరంలో చిరంజీవి, ఈ తరంలో ఎన్టీఆర్ మాత్రమే ద్విపాత్రాభినయంతో పేరు తెచ్చుకున్నారు. మరి విజయ్ దేవరకొండ, చిరంజీవిని ఎన్టీఆర్ ను తన ద్విపాత్రాభినయంతో బీట్ చేస్తాడా ? చూడాలి.
Also Read:RockStar Actresses: వెండితెరను ఏలారు, రోడ్డున పడ్డారు
