https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8′ నయనీ పావని అవుట్..4 వారాలకు ఊహించని రెమ్యూనరేషన్..మళ్ళీ ఇలాంటి ఛాన్స్ కష్టమే!

నయనీ పావని రెండు సీజన్స్ కి సంబంధించిన ప్రయాణం ని గమనిస్తే ఆమెని ఆడియన్స్ అసలు నచ్చలేదని అర్థం అవుతుంది. ప్రతీ విషయంలోనూ అవసరం లేని ఓవర్ యాక్షన్ చేయడం, ప్రతీ చిన్న దానిని పెద్దది చేసి బోరుమని ఏడవడం, అదే కంటెంట్ అని ఈమె అనుకుంది. ఆడియన్స్ ఆ కంటెంట్ ని భరించలేక మొత్తానికి బయటకి పంపేశారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 12:57 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  పెద్దగా ఫేమ్ లేని సెలబ్రిటీస్ కి బిగ్ బాస్ లాంటి బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అవకాశం రావడం చాలా కష్టం. ఒక ఆర్టిస్టు కి కెరీర్ పరంగా పునర్జన్మ లాంటిది బిగ్ బాస్ షో. అలాంటి అవకాశం రెండుసార్లు వచ్చినా ఉపయోగించుకోలేకపోయింది నయనీ పావని. బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆమె మొదటి వారం లోనే ఎలిమినేట్ అయ్యింది. గత వారం లో కూడా ఈమె ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యినట్టే, కానీ మెహబూబ్ ని కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ టీం బయటకి పంపాల్సి వచ్చింది కాబట్టి, ఒక వారం అదనంగా హౌస్ లో ఉన్నింది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమె ఎలిమినేట్ అయ్యినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.

    నయనీ పావని రెండు సీజన్స్ కి సంబంధించిన ప్రయాణం ని గమనిస్తే ఆమెని ఆడియన్స్ అసలు నచ్చలేదని అర్థం అవుతుంది. ప్రతీ విషయంలోనూ అవసరం లేని ఓవర్ యాక్షన్ చేయడం, ప్రతీ చిన్న దానిని పెద్దది చేసి బోరుమని ఏడవడం, అదే కంటెంట్ అని ఈమె అనుకుంది. ఆడియన్స్ ఆ కంటెంట్ ని భరించలేక మొత్తానికి బయటకి పంపేశారు. వాస్తవానికి నయనీ పావని భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. రెండవసారి అవకాశం వచ్చింది కదా, ఈమె ఈసారి అదరగొట్టేస్తుంది, టాస్కులు బాగా ఆడుతుంది అనుకున్నారు.

    అంతే కాదు గత సీజన్ లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యినందుకు ఈమెపై ప్రేక్షకుల్లో చాలా సానుభూతి ఏర్పడింది. గత సీజన్ లో అత్యంత ప్రేక్షకాదరణ పొంది టాప్ 3 కంటెస్టెంట్ గా నిల్చిన శివాజీ ఈమెకి ఓట్లు వేయమని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకులను రిక్వెస్ట్ చేయడం, అదే విధంగా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సీజన్ నుండి సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మణికంఠ కూడా ఈమెకు సపోర్టుగా సోషల్ మీడియా లో ప్రచారం చేయడం వంటివి జరిగాయి. ఇంత బ్యాక్ గ్రౌండ్ తో హౌస్ లోకి వచ్చినా కూడా ఈమెకి ఆడియన్స్ సపోర్టు చెయ్యడం లేదంటే ఎంత చెత్తగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అసలే ఈమె జనాలకు నచ్చలేదు. దానికి తోడు నిన్న ఈమె టాప్ కంటెస్టెంట్ గౌతమ్ తో అనవసరంగా కారణంగా లేకుండా గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ గౌతమ్ గురించి నెగటివ్ ప్రచారం చేస్తూ చాలా అతి చేసింది. ఇది చూసిన తర్వాత ఈమెకు ఓట్లు వేద్దాం అనుకున్నోళ్ళు కూడా వెనక్కి తగ్గుంటారు. ఇదంతా పక్కన పెడితే ఈమెకి రెమ్యూనరేషన్ కూడా బాగానే ముట్టినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నాలుగు వారాలు ఈమె హౌస్ లో ఉన్నందుకు గానూ 8 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చారట. అంటే వారానికి రెండు లక్షల రూపాయిలు అన్నమాట. ఇప్పుడున్న ఈమె ఫేమ్ కి రెండు లక్షలంటే చాలా ఎక్కువే, మళ్ళీ ఇలాంటి ప్యాకేజ్ ఇచ్చే షోస్ ఈమెకి దొరకడం అంత తేలికైన విషయం కాదు.