Doordarshani Teaser Review: డైరెక్టర్ తేజ తెరకెక్కించిన నువ్వు నేను, జయం టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ గా ఉన్నాయి. ఇంటెన్స్ ప్యూర్ లవ్ డ్రామాలతో ఆయన భారీ హిట్స్ కొట్టాడు. తేజ మార్క్ లవ్ స్టోరీస్ ఈ మధ్య పెద్దగా రావడం లేదు. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు విలేజ్ లవ్ డ్రామా రానుంది. కొత్త నటులతో దూరదర్శని టైటిల్ తో మూవీ తెరకెక్కింది. ‘కలిపింది ఇద్దరినీ’ క్యాప్షన్. టైటిల్ చాలా కొత్తగా ఉంది.
కాగా నేడు దూరదర్శని: కలిపింది ఇద్దరినీ టీజర్ విడుదలైంది. నిమిషానికి పైగా ఉన్న టీజర్ మెప్పించింది. సినిమాపై అంచనాలు పెంచింది. కోనసీమ అందాలు టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేద ధనిక వర్గాల మధ్య ప్రేమ, దాంతో పెద్దవారి నుండి వ్యతిరేకత, వేధింపుల సమాహారంగా మూవీ సాగనుంది. టీనేజ్ లవర్స్ గా హీరో హీరోయిన్ పాత్రలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా దూరదర్శని టీజర్ మెప్పించింది. ఈ చిత్రానికి కార్తికేయ కోమి దర్శకుడు. సువిక్షిత్ బొజ్జ హీరోగా నటించాడు. గీతిక రతన్ హీరోయిన్. భద్రం, కృష్ణ రెడ్డి, కిట్టయ్య ఇతర కీలక రోల్స్ చేశారు. జయ శంకర్ రెడ్డి ఎమ్ నిర్మించాడు.