అదేంటో సినిమా వాళ్లల్లో చాలామందికి ఆశకి అత్యాసకి పెద్దగా తేడా తెలియదు. సక్సెస్ రాకముందు వరకూ కూలీ డబ్బులు అడగడానికి కూడా మొహమాట పడతారు. కానీ, ఒక్కసారి ఒక్క హిట్టు వచ్చిందా ? ఇక అంతే, రేట్లు ఆకాశమంతా పెరిగిపోతాయి. కాలు తీసి బయట పెట్టాలంటే ప్రొడక్షన్ కారు కావాలి. నిన్నటి వరకూ పచ్చడి మెతుకులు కూడా లేనోడికి, రాత్రికి హిట్టు వస్తే, తెల్లారే సరికి సెవన్ స్టార్ హోటల్ నుండి టిఫిన్ తీసుకురావాలి. ఇలా ఉంటుంది వ్యవహారం.
అందుకే ఒక్క సినిమా గట్టి హిట్ పడితే చాలు, రేట్లు ప్లేస్ లో ఇక కోట్లు వచ్చి పడాల్సిందే.
ఇక విషయం ఉన్న హీరోలు అయితే ఎంతైనా అడగొచ్చు. అందుకే నవీన్ పోలిశెట్టి ఏకంగా నాలుగు కోట్లు ఎక్కువ అడుగుతున్నాడట. జాతి రత్నాలు సినిమా కోసం నవీన్ కి ఇచ్చింది ముప్పై లక్షలు. కానీ నవీన్ ప్రస్తుతం అడుగుతున్న రెమ్యునరేషన్ నాలుగు కోట్లు. మొత్తానికి తన రెమ్యూనరేషన్ తో అందరికి షాక్ ఇచ్చాడు నవీన్. తన కామెడీ టైమింగ్ తో కంప్లీట్ యాక్టర్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ఈ నెల్లూరు కుర్రాడు.
పైగా ఇతగాడు హీరోగా వచ్చిన జాతి రత్నాలు సినిమా కరోనా పాండమిక్ టైమ్ లో కూడా థియేటర్ల నుంచి దాదాపు రూ. 65 కోట్లు గ్రాస్ రాబట్టి పెద్ద హిట్ అనిపించుకుంది. పైగా జాతిరత్నాలు సినిమా 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో యూఎస్ లో వన్ మిలియన్ డాలర్స్ రాబట్టింది. లాక్ డౌన్ తరువాత అక్కడ చిన్న సినిమాల్లో ఈ సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది.
పైగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ హీరో నవీన్ పోలిశెట్టినే. తన వన్ మ్యాన్ షోతో అలాగే తనకున్న ఫుల్ క్రేజ్ తో థియేటర్స్ వరకూ జనం వచ్చారు. అందుకే టాలీవుడ్ లో అతనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ డిజిటల్ జనరేషన్ కూడా నవీన్ పోలిశెట్టిని బాగా ఓన్ చేసుకుంటుంది. ఇక ఇతనికి 4 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ముప్పై లక్షల నుండి నాలుగు కోట్లుకు ఎదిగాడు అంటే.. గ్రేటే.