Naveen Polishetty : మన టాలీవుడ్ లో ఇటీవల కాలం లో సీనియర్ డైరెక్టర్స్ కంటే, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో, విభిన్నమైన జానర్స్ తో సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు ‘మ్యాడ్'(Mad Square) సిరీస్ దర్శకుడు కళ్యాణ్ శంకర్(Kalyan Shankar). ‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి కూడా ఈయనే దర్శకత్వం వహించాడు. ఈయన సినిమాలన్నీ చూస్తే ఇతను మంచి స్కిల్ ఉన్న డైరెక్టర్, ముఖ్యంగా కామెడీ టైమింగ్ లో వేరే లెవెల్ టాలెంట్ ఉంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలాంటి డైరెక్టర్ ని నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) తన సినిమా నుండి తరిమేశాడు అనే వాస్తవం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ ప్రొమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ శంకర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించాడు.
Also Read : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరో అజిత్..ఫ్యాన్స్ కన్నీళ్లు!
ముందుగా యాంకర్ కళ్యాణ్ శంకర్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు, నవీన్ పోలిశెట్టి కి మధ్య గొడవ ఏమిటి?,అసలు ఏమి జరిగింది?’ అని అడగగా, దానికి కళ్యాణ్ శంకర్ సమాధానం ఇస్తూ ‘నేను ఆయనకు లాక్ డౌన్ సమయంలోనే ‘అనగనగ ఒక రాజు’ సబ్జెక్టు వినిపించాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. లాక్ డౌన్ అయిపోయిన వెంటనే షూటింగ్ ప్రారంభించి కొంత భాగం పూర్తి చేసాము. కానీ మధ్యలో ఆయన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఒకే సమయంలో సమాంతరంగా రెండు సినిమాలు చేసే ఉద్దేశ్యం ఆయనకు లేదు. దీంతో నా సినిమా షూటింగ్ అలా పెండింగ్ లో పడిపోయింది. చాలా రోజులు ఎదురు చూసాను, ఇక నావల్ల అవ్వక వేరే సినిమాకు షిఫ్ట్ అయిపోయాను. ఇది ఆయనకు నచ్చలేదేమో, అందుకే నన్ను ఆ చిత్రం నుండి తప్పించాడు’.
‘నాగవంశీ తో కథ మనకి ఇచ్చేయమను, డైరెక్టర్ ఎవరో నేను చెప్తా అని అన్నాడట. అలా ఆ సినిమా నుండి నేను తప్పుకోవాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ‘మారి’ అనే వ్యక్తి రంగం లోకి దిగాడు. ఇంతకు ముందు హీరోయిన్ గా శ్రీలీల ఉండేది. ఇప్పుడు ఆమెని కూడా తప్పించి మీనాక్షి చౌదరి ని ఎంచుకున్నారు. అలా మూవీ క్యాస్టింగ్, టెక్నికల్ డిపార్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం నవీన్ పోలిశెట్టి చెప్పిన విధంగా మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు నవీన్ పోలిశెట్టి హీరో గా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.
Also Read : నైజాంలో అదుర్స్..ఆంధ్రలో బెదుర్స్..’ఆర్య 2′ రీ రిలీజ్ బుకింగ్స్ పరిస్థితి!