https://oktelugu.com/

Radhe Shyam: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్​ హోస్ట్​గా జాతిరత్నాలు హీరో

Radhe Shyam: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే డిసెంబరు 23న రామోజీ ఫిల్మ్ సిటీలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 02:09 PM IST
    Follow us on

    Radhe Shyam: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే డిసెంబరు 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ లెవెల్​లో నిర్వహిస్తున్నారు మేకర్స్​. తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి జాతిరత్నాలు హీరో నవీన్​ పొలిశెట్టి హోస్ట్​గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

    Radhe Shyam

    Also Read: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. జాతి రత్నాలు సినిమాతో స్టార్​హీరో రేంజ్​ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్​. జాతిరత్నాలు ప్రమోషన్స్​లో ప్రభాస్​- నవీన్​ కలిసి చేసిన సందడి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా ఈవెంట్​కు హోస్ట్​గా వ్యవహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  నవీన్​ కామిడీ పంచ్​లు, అల్లరి ఈవెంట్​ని వేరే లెవెల్​కు తీసుకెళ్తాయని అందరూ అనుకుంటున్నారు.

    కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది. ఇందులో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్​. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

    Also Read: రాధేశ్యామ్​ నుంచి సంచారి ఫుల్​సాంగ్​ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు