Naveen chandra: చేసింది చిన్న సినిమాలే అయినా.. కెరీర్లో ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. తాజాగా, మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. నవీన్ హీరోగా, శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తగ్గేదే లే.. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. కాగా, భద్ర ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్లో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అడుగుపెట్టనుంది. ఈ సంస్థకు ఇదే తొలి చిత్రం.
Wishing the enduring beauty #DivyaPillai❤️ Aka "Devi" a very happy birthday and a wonderful year ahead 💫.#ThaggedheLe 💥@Naveenc212 #Ananya @Ravishankar_66 @Rajaraveendar @BhadraProdns @Srinivasrajuofl #VenkatPrasad @Garrybh88 #CharanArjun #HBDDivyaPillai pic.twitter.com/r3RDghtdXV
— Bhadra Productions (@BhadraProdns) November 23, 2021
ఈ సినిమాలో నవీన్‌కు జోడీగా దివ్యా పిళ్లై నటించింది. కాగా, దివ్వా పిళ్లై పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు జనాల్లో మంచి ఆదరన దక్కించుకున్నాయి. కాగా, త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో దివ్యా పిళ్లైతో పాటు అనన్య సేనుగుప్తా హీరోయిన్గా కనిపించనుంది. కాగా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవికాలే, తదితరులు కీలక పాత్రలో పోషించారు.
అందాల రాక్షసి సినిమా తర్వాత పెద్దగా హిట్ కొట్టలేకపోయారు నవీన్. ఇటీలవే అరవింద సమేతలో జగపతి బాబు కొడుకుగా నటించి మంచి మెప్పును పొందాడు. అందులో తన నటనకు జనాలు నీరాజనాలు పట్టారు. ఇప్పుడు మళ్లీ హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.