RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రానున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, విడుదల తేదీ కూడా దగ్గరపడుతుండటంతో సినిమాపై రోజుకో కొత్త అడ్డేట్ ఇస్తూ.. సినిమాపై హైప్ పెంచుతున్నారు.
కాగా, ఇటీవల విడుదలైన నాటు నాటు పాట ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతోంది. తారక్, చెర్రీలు ఇందులో ఊర మాస్ స్టెప్పులేస్తూ కనిపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతోంది. కాగా, ఈ సినిమాలో తారక్, చెర్రి వేసిన స్పప్పులు అందర్నీ ఆకర్శించాయి. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు వీరిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఈ పాటలో స్టెప్స్ వేయడానికి చరణ్, తారక్ ఎన్ని టేకులు తీసుకున్నారో తెలుసా? సుమారు 15- 8 టేకులు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా చెప్పడం గమనార్హం. ఈ స్టెప్స్ కరెక్ట్‌గా చేయడం కోసం రాజమౌళి తమకు చుక్కలు చూపించాడని చెప్పారు. ఇప్పుడు పాటకు అందరూ పొగుడుతుంటే.. రామౌళి విజయ్ ఎంతో తెలిసిందని అన్నారు. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో రాజమౌళి చాలా ఎక్స్పర్ట్. అందులో వరుస హిట్లతో టాప్ డైరెక్టర్‌గా దూసుకెళ్లిపోతున్నాడు.
కాగా, డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.