Natural Star Nani: అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు నాచురల్ స్టార్ నాని. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఇప్పటివరకు ఎమోషనల్, కామెడీ సినిమాలు ఎక్కువగా చేసిన త్వరలోనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’.

ఇటీవల సినిమాలోని టైటిల్ గీతాన్ని విడుదల చేసిన సందర్భంగా నాని మీడియా, అభిమానులతో మాట్లాడారు. ఈ ఈవెంట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఈ మేరకు నాని గతంలో జెర్సీ సినిమాతో అందర్నీ మెప్పించారు. తన కెరీర్ లో ఓ అద్భుతమైన చిత్రంగా నిలిచిపోయింది జెర్సీ. అయితే మళ్ళీ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తారా అని అడిగారు. ఇందుకు నాని బదులిస్తూ ఇప్పటికే స్పోర్ట్స్ డ్రామాలో రెండు సినిమాలు చేశాను. మరో చిత్రం చేశానంటే ఇలాంటి చిత్రాలకి అంబాసిడర్ అయిపోతానేమోనని బ్రేక్ ఇస్తున్న అని చెప్పారు. ఇప్పట్లో స్పోర్ట్స్ చిత్రాలు చేయనని, మరో ఐదారేళ్ల తర్వాత చేయాల్సి వస్తే అప్పటికి ప్లేయర్‌గా సరిపోను కాబట్టి కోచ్ పాత్రల్లో నటించాల్సి వస్తుందేమో అన్నారు.
నాని గతంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘జెర్సీ’ లాంటి స్పోర్ట్స్ సినిమాలతో మెప్పించారు. ఈ రెండు సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తాడు. నాని ఇలా చెప్పడంతో మరోసారి నాని నుంచి స్పోర్ట్స్ సినిమాలు రాకపోవొచ్చు అనే తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్, టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.