https://oktelugu.com/

Johnny Master case : జానీ మాస్టర్ కేసుపై నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా.. ధైర్యంగా ఇంత రిస్క్ చేయడం వెనుక ఎవరున్నారు?

ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. అలాగే శైలేష్ కొలను దర్శకత్వం లో 'హిట్ 3' లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల అవ్వగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2024 / 09:06 PM IST

    Nani(2)

    Follow us on

    Johnny Master case : టాలీవుడ్ మొత్తం ఇప్పుడు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన మీద ‘పోక్సో’ చట్టం క్రింద కేసు నమోదు అవ్వడంతో, వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దు అయ్యింది. నేరం రుజువు కాకముందే నేషనల్ అవార్డుని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, జానీ మాస్టర్ కి సపోర్టుగా ఇండస్ట్రీ నుండి కొంతమంది కొరియోగ్రాఫర్స్ ముందుకు వచ్చారు. అయితే జానీ మాస్టర్ ఈ విషయం లో తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే, వరుస హిట్స్ తో మంచి జోరు మీదున్న నేచురల్ స్టార్ నాని ఈ కేసు ని ఆధారంగా తీసుకొని ఒక సినిమాని రీసెంట్ గానే ప్రారంభించాడు. కానీ ఆయన ఇందులో హీరోగా నటించడం లేదు, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

    ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ఇందులో హీరోగా ఎంపిక అయ్యాడు. రామ్ జగదీశ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి ‘కోర్ట్’ అనే టైటిల్ ని పెట్టారు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే బ్యానర్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై ఆయన ‘హిట్’, ‘హిట్ 2’, ‘ఆ’ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించాడు. అంతే కాకుండా ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఇప్పుడు రామ్ జగదీశ్ అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం జానీ మాస్టర్ మీద నమోదైన ‘పోక్సో’ కేసు పై కథ నడుస్తుందట. మైనర్ బాలికలపై అత్యాచారం చేసే వాళ్లపై నాన్ బెయిల్ వారెంట్ క్రింద అరెస్ట్ చేస్తారు. ఈ కేసు నుండి బయట పడడం ఎంత పెద్ద పలుకుబడి ఉన్నవాడికైనా కష్టమే. అందుకే జానీ మాస్టర్ కి నేరం రుజువు కాకపోయినప్పటికీ, కనీసం బెయిల్ కూడా దొరకడం లేదు.

    అలాంటి కేసు మీద సినిమాని నిర్మించాలనే ఆలోచన నాని కి రావడం నిజంగా అభినందించదగ్గ విషయం. మరి డైరెక్టర్ జగదీశ్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించబోతున్నాడో చూడాలి. ఇదంతా పక్కన పెడితే నాని రీసెంట్ గానే ‘సరిపోదా శనివారం’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 55 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఆయన రీసెంట్ గానే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభించాడు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. అలాగే శైలేష్ కొలను దర్శకత్వం లో ‘హిట్ 3’ లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల అవ్వగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.