https://oktelugu.com/

Hero Nani: నేచురల్ స్టార్ నాని కాలికి తీవ్ర గాయం… ఇప్పుడు ఎలా ఉన్నారంటే ?

Hero Nani: సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి నేచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాగా ఇప్పుడు తాజాగా హీరో నాని కాలుకు తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఆయ‌న‌ను ఒక ప్ర‌ముఖ ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని స‌మాచారం. అయితే ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే హీరో నాని కాలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 3, 2022 / 01:17 PM IST
    Follow us on

    Hero Nani: సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి నేచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాగా ఇప్పుడు తాజాగా హీరో నాని కాలుకు తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఆయ‌న‌ను ఒక ప్ర‌ముఖ ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని స‌మాచారం. అయితే ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే హీరో నాని కాలు కు తీవ్ర గాయం అయింద‌న్న వార్త తెలిసిన అభిమానులు ఆందోళ‌నలో ఉన్నారు.

    కాగ హీరో నాని ప్ర‌స్తుతం అంటే సుంద‌రానికి అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవ‌ల ఆ సినిమా కు సంబంధించిన లుక్ ను కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే ఇలాంటి ప‌రిస్థ‌తుల్లో నాని కాలుకు తీవ్ర గాయం అయింద‌న్న వార్త తెలిసిన అభిమ‌నులు ఆందోళ‌న చెందుతున్నారు.

    కాగా నాని నటించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ‌డంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా రోజుల త‌ర్వాత శ్యామ్ సింగ రాయ్ తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. అయితే ఇటీవ‌ల సినిమా టీకెట్ల విష‌యం పై ఏపీ ప్ర‌భుత్వం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాని త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మరో వైపు నాని, కీర్తి సురేష్ తో జతగా దసరా అనే సినిమాలో నటిస్తున్నారు.