OTT: కరోనా మూడో వేవ్ కూడా వేగంగవంతం కావడంతో ప్రస్తుతం మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి గడ్డుకాలం వచ్చినట్టే. తెలుగు సినిమా బాక్సాఫీస్ కి ‘అఖండ’ ఊపు తీసుకొచ్చింది, ఆర్ఆర్ఆర్ తో ఇక రికార్డుల అన్నీ చెల్లా చెదిరిపోతాయని ఆశ పడితే.. చివరకు అది ఆశగానే మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ సినిమా రంగానికి కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ.
ఎలాగూ ఈ కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలచేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. ఆ ఘనత ఓటీటీలకే దక్కుతుంది.
Also Read: స్టార్ హీరో పైత్యం.. ఇక కోటి ఇవ్వడం ఎందుకు దండగ !
పైగా ఓటీటీ సంస్థలు మాత్రమే నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది.
మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఆహా :
ప్రాచీన క్రీడా నేపథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘లక్ష్య’. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో శరత్ మరార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ‘ఆహా’లో 2022 జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
జీ5 :
నాగ శౌర్య హిట్ కోసం కోటి ఆశలతో రీతూ వర్మతో కలిసి చేసిన సినిమా ‘వరుడు కావలెను’. ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా జనవరి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది.
కౌన్ బనేగీ షికార్వతి (హిందీ సిరీస్) జనవరి 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ద టెండర్ బార్ (హాలీవుడ్) జనవరి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎంఎక్స్ ప్లేయర్ :
క్యాంపస్ డైరీస్ (హిందీ సిరీస్) జనవరి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
సోనీ లివ్ :
క్యూబికల్స్ (హిందీ సిరీస్) జనవరి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ :
మదర్/ఆండ్రాయిడ్ (హాలీవుడ్) జనవరి 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.