https://oktelugu.com/

Allu Arjun National Award: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు… మహేష్ బాబు దురదృష్టవంతుడు అంటూ ట్రోల్స్!

పుష్ప చిత్రాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా మహేష్ నేషనల్ అవార్డు కోల్పోయాడని. ఒకవేళ ఆయన పుష్ప చేసి ఉంటే అత్యున్నత పురస్కారం దక్కేదని అంటున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 25, 2023 / 12:07 PM IST

    Allu Arjun National Award

    Follow us on

    Allu Arjun National Award: నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కి రావడంతో మహేష్ బాబు ట్రోల్ కి గురవుతున్నాడు. ఆయన గతంలో వేసిన ట్వీట్ తెరపైకి వచ్చింది. అన్ లక్కీ హీరో నేషనల్ అవార్డు మిస్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే… రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సుకుమార్ నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అనుకున్నారు. పుష్ప స్క్రిప్ట్ మహేష్ బాబుకు నెరేట్ చేశారు. తన ఇమేజ్ కి ఈ కథ సెట్ కాదని నమ్మిన మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

    సుకుమార్ తో నేను చేయాలనుకున్న ప్రాజెక్ట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆగిపోయింది. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి బెస్ట్ విషెస్. గొప్ప దర్శకుడిగా సుకుమార్ పై నాకు గౌరవం ఉంది. ఆయన తెరకెక్కించిన 1 నేనొక్కడినే కల్ట్ క్లాసిక్ గా ఉంది. ఆయనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను… అని 2019లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

    పుష్ప చిత్రాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా మహేష్ నేషనల్ అవార్డు కోల్పోయాడని. ఒకవేళ ఆయన పుష్ప చేసి ఉంటే అత్యున్నత పురస్కారం దక్కేదని అంటున్నారు. అయితే కొందరు ఈ వాదన కొట్టిపారేస్తున్నారు. ఒకరికి సెట్ అయ్యే కథ మరొకరికి సెట్ కాకపోవచ్చు. మహేష్ పుష్ప మూవీ చేసి ఉంటే ఆయనకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందన్న గ్యారంటీ లేదు. చిత్ర ఫలితం కూడా ఒకేలా ఉంటుందనే నమ్మకం లేదు.

    మక్కీకి దించిన తీసిన హిట్ చిత్రాల రీమేక్స్ అన్నీ సక్సెస్ కాలేదు. కాబట్టి హీరో ఇమేజ్, మేనరిజం, బాడీ లాంగ్వేజ్ కూడా చిత్ర విజయాన్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి పుష్ప స్క్రిప్ట్ ని మహేష్ బాబు తప్పుగా జడ్జి చేశాడని చెప్పలేం అంటున్నారు. అందులోనూ సుకుమార్ తో అల్లు అర్జున్ ది బెస్ట్ కాంబినేషన్. సుకుమార్ డెబ్యూ మూవీ ఆర్య కాగా, అల్లు అర్జున్ ఫస్ట్ హిట్ మూవీ ఆర్యగా ఉంది. ఆర్య చిత్రంతోనే అల్లు అర్జున్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. పుష్పతో సుకుమార్ అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టాడు.