Narivetta Full Movie Review : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న ఇండస్ట్రీలో మలయాళం ఇండస్ట్రీ ఒకటి… వాళ్లు చిన్న సబ్జెక్ట్ ని సైతం రెండున్నర గంటలపాటు ఎక్స్టెండ్ చేస్తూ ప్రేక్షకుడిని కూర్చోబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. చిన్న కాన్సెప్ట్ తో సినిమాలను చేసి చాలా సార్లు సక్సెస్ లను సాధించి చూపించారు. ‘నరివెట్ట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం విశేషం… టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
అడవిలో అక్రమంగా నివసిస్తున్న కొంతమందిని ఖాళీ చేయించి ఆ ప్లేస్ ని ప్రభుత్వ హ్యాండవర్ లోకి తీసుకోవాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో బ్రతుకుతున్న వాళ్లు మేము ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయేదే లేదు అంటూ పోలీసులకు ఎదురు తిరగడంతో అక్కడ కొన్ని అల్లర్లు జరుగుతాయి. ఇక ఆ అల్లర్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా టోవినో థామస్ అడవి మనుషుల్లో ఒకరిని కాల్చేస్తాడు దాంతో ఆయన చనిపోతాడు.
ఇక టోవినో థామస్ మీద కేసు ఫైల్ చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నిజానికి టోవీనో థామస్ అతన్ని చంపాడా లేదంటే కొంతమంది కావాలనే టోవినో థామస్ ని ఆ మర్డర్ కేసులో ఇరికించారా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు అనురాజ్ మనోహర్ ఇంతకుముందు చేసిన ఇష్క్ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. మలయాళం సినిమా ఇండస్ట్రీలోనే ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. చిన్న పాయింట్ తో ప్రేక్షకులను కట్టిపడేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో ఈయన కూడా ఒకరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో కూడా ఒక చిన్న పాయింట్ ను తీసుకొని రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాడు. నిజానికి ఇదొక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ థియేటర్లో చూస్తున్నంత సేపు మన తెలుగు సినిమాలను చూసినట్టుగానే అనిపిస్తుంది. అలాగే రెండున్నర గంటల పాటు ఎక్కడ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా చాలా ఎంగేజింగ్ గా ఈ స్క్రీన్ రాసుకున్న పద్ధతి సినిమాను నడిపించిన విధానం అయితే అద్భుతం…
ముఖ్యంగా స్క్రీన్ ప్లే లో కొన్ని లాక్స్ వేసుకొని వాటిని రివిల్ చేయడం ట్విస్టులను కూడా అద్భుతంగా మలచడంతో ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి అవి బాగా నచ్చుతాయి. ఇక ఆయన ఎంచుకున్న సబ్జెక్టు చిన్నదే అయినప్పటికి ఆయన రాసుకున్న ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా, ఫ్రెష్ గా ఉండడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. టోవినో థామస్ యాక్టింగ్ కూడా ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ఎలివేట్ చేయడంలో చాలా వరకు హెల్ప్ అయింది…
ఇక ఈ సినిమాని ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీసాము అంటూ సినిమా యూనిట్ అయితే చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాడు. ఒకవేళ డ్యూటీలో నుంచి సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అలాంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేది కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఒక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే టోవినో థామస్ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడు అనే చెప్పాలి. ఇక చాలా ఉత్తమమైన ప్రదర్శనను చూపించాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే తన నటన ప్రతిభను మెరుగుపరుచుకొని మరి ఈ సినిమాలో మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. వేరియేషన్స్ చూపించడంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు.ఇక సూరజ్ వెంజరమూడు పర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది.
ఆయన కనిపించిన సీన్స్ లో ప్రేక్షకుడిని రిలీఫ్ చేస్తూ ఆ సినిమాలోని డెప్త్ ను చెడగొట్టకుండా దర్శకుడు ఆ క్యారెక్టర్ ని వాడుకున్న విధానం అయితే చాలా బాగుంది…ప్రియంవాడ కృష్ణన్ పాత్ర కూడా చాలా బాగుంది. ఆమె ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ ను ఇచ్చి ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అయింది… చరణ్ పాత్రకి కూడా మంచి స్కోప్ ఉండటం తో ఆయన కూడా చాలా బాగా నటించి మెప్పించాడు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బోజెస్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన చాలా కేర్ తీసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది… సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఫారెస్ట్ లో తీసిన షాట్స్ విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి. అలాగే ప్రతి షార్ట్ కి ప్రాపర్ వే ను వాడుతూ విజువల్ గా ప్రేక్షకుడికి ఒక మంచి అనుభూతిని అందించే ప్రయత్నం అయితే చేశారు.
మొత్తానికైతే దర్శకుడు ఇచ్చిన సలహాలతో ఆ సినిమా మూడుని చెడగొట్టకుండా మంచి షాట్ ను డిజైన్ చేసి ప్రేక్షకుడి ముందించే ప్రయత్నం చేశారు… ఇక ఎడిటర్ సైతం ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ చేశాడు. అనవసరమైన సన్నివేశాలను లెంతిగా ఉంచకుండా చాలా షార్ప్ గా కట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సైతం బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
కథ
టోవినో థామస్ యాక్టింగ్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్స్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లేవు…
ఫస్టాఫ్ మొదట్లో కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5