Anasuya Bharadwaj Cried: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలతో ఒకరు యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj). వివాదాలు ఈమె చుట్టూ తిరుగుతాయో, లేదా ఈమె వివాదాల చుట్టూ తిరుగుతుందో తెలియదు కానీ, ఎప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీలో ఉంటూనే ఉంటుంది ఈమె. నిన్న మొన్నటి వరకు విజయ్ దేవరకొండ పై నోరు పారేసుకుంటూ ఉండేది. అతని పై ఎన్ని కామెంట్స్ చెయ్యాలో, అన్ని నెగిటివ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకుంది. ఇక రీసెంట్ టైం లో ఆమె శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అనసూయ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా భగ్గుమంది. 100 శాతం లో 90 శాతం మంది నెటిజెన్స్ ఆమె కామెంట్స్ ని తప్పుబడితే,కేవలం పది శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఈ అంశం ఇప్పుడు నెమ్మదిగా చల్లారింది.
అయితే నిన్న ఆమె ఒక ప్రెస్ మీట్ జూమ్ కాల్ లో మాట్లాడుతూ వెక్కి వేక్ ఏడ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని చూసినా, నేను కూడా ఒక మనిషినే, ఒక మహిళనే’ అంటూ కంటతడి పెట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే స్త్రీ హక్కుల గురించి నిన్న జరిగిన జూమ్ కాల్ లో తనకు లభించిన మద్దతు గురించి ఇన్ స్టాగ్రామ్ లో చెప్తూ కంటతడి పెట్టుకుంది. ఆ సమయం లో నాకు లభించిన మద్దతు చూసి తెలియకుండానే నా కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయని , అలా యేడ్చినందుకు నేను సిగ్గుపడడం లేదని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. వాస్తవానికి ఆమె ఎలాంటి తప్పు మాటాడలేదు. అయినప్పటికీ కూడా ఈమె పోస్ట్ క్రింద నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. దీనిని బట్టీ ఆమెకు ఎలాంటి నెగిటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇది అనసూయ కెరీర్ విషయానికి వస్తే, బుల్లితెర పై జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా పదేళ్ల పాటు కొనసాగుతూ వచ్చిన అనసూయ కి గొప్ప పేరొచ్చింది. ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ తోనే ఆమె సినిమాల్లో అవకాశాలు సంపాదించింది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనసూయ, ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టు గా ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగు లో ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈమధ్య కాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉండడం వల్ల ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
