Nari Nari Naduma Murari Opening Collection: ‘శతమానం భవతి’ చిత్రం తర్వాత కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతూ, మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్న హీరో శర్వానంద్(Sharwanand), ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari Movie) చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు. విడుదలకు ముందే ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో కాస్త ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిచింది. కానీ సంక్రాంతికి చాలా సినిమా విడుదల అవుతున్నాయి, శర్వానంద్ కి ఏమో వరుస ఫ్లాప్స్ ఉండడం వల్ల అందరి కంటే అతనికే తక్కువ థియేటర్స్ రావొచ్చు, పైగా ప్రొమోషన్స్ కూడా చాలా తక్కువ చేశారు, ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదేమో అని అంతా అనుకున్నారు. నిన్న సాయంత్రం ప్రీమియర్ షోస్ తో ఈ సినిమా మొదలైంది. ఆడియన్స్ నుండి అద్భుతంగా పాజిటివ్ టాక్ రావడంతో నేడు ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి.
దొరికిన థియేటర్స్ తక్కువే, కానీ ఆ తక్కువ థియేటర్స్ తోనే కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది ఈ చిత్రం. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, జనాల్లో ఈ సినిమాకు ఎలాంటి పాజిటివ్ టాక్ ఉంది అనేది. కొన్ని ప్రాంతాల్లో ఆడియన్స్ నుండి విపరీతమైన డిమాండ్ రావడం తో షోస్ బాగా పెంచారు. రేండు మూడు షోస్ తో మొదలైన ఈ సినిమా, పది షోస్ కి పైగా కొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్ చేయబడ్డాయి. డిమాండ్ ని బట్టీ షోస్ కౌంట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కంటెంట్ పరంగా అయితే ఈ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ కంటే గొప్పగా ఉందని అంటున్నారు చూసిన ప్రతీ ఒక్కరు. నిన్న విడుదలైన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కంటే ఇదే బెటర్ గా ఉందని అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 5 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ సంక్రాంతి హాలిడేస్ లో మాత్రమే కాకుండా , ఈ వీకెండ్ కూడా ఈ చిత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం కేవలం మొదటి వారం లోనే అందుకునే అవకాశాలు ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ తర్వాత ఈ చిత్రం రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి. మొత్తం మీద శర్వానంద్ పదేళ్ల తర్వాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.