Shambhala OTT: కెరీర్ లో సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఆది శివకుమార్(Aadi Sivakumar), ఈసారి ఎలా అయినా ఆడియన్స్ ని మెప్పించే సినిమాని తియ్యాలి అనే కసితో చేసిన చిత్రం ‘శంబాలా'(Sambhala Movie). గత ఏడాది డిసెంబర్ 25 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విజయవంతంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత మీడియం రేంజ్ సినిమాలను థియేటర్స్ లో చూడడం మానేశారు ఒక సెక్షన్ ఆడియన్స్. అలాంటి వాళ్ళు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఆడియన్స్ కి ఈ సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్.
ఈ చిత్రాన్ని ఆహా మీడియా మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఈ నెల 22వ తేదీ నుండి ఈ చిత్రాన్ని ఆహా యాప్ లో విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఆహా గోల్డ్ యూజర్లు మాత్రం ఒక రోజు ముందుగానే ఈ చిత్రాన్ని చూడొచ్చు. కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆడియన్స్ ని విశేషంగా అలరించిన ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో అలరిస్తుందో లేదో చూడాలి. అయితే ఈ చిత్రాన్ని థియేటర్ లో చూసినప్పుడు కలిగిన అనుభూతి, మామూలు స్క్రీన్ లో చూస్తే కలగదని, థియేటర్స్ లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వాళ్ళు మంచి సినిమాటిక్ అనుభూతిని కోల్పోయారని కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి 1980 వ దశకానికి చెందిన కథ ఇది.
వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఒక ఊరు లో, ఒక రాత్రి ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుండి ఆ ఊరిలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అకస్మాత్తుగా ఎవరో ఒకరు వింతగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తుంటారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. దీంతో బండ భూతం ఈ ఊరిని ఆవహించిందంటూ అక్కడి జనాలు వణికిపోతుంటారు. దేశవ్యాప్తంగా ఈ ఊరి గురించి చర్చించుకోవడం మొదలు పెడుతారు. అలా ప్రభుత్వం తరుపున విక్రమ్ ‘ఆది సాయి కుమార్’ అనే ఒక యువ శాస్త్రవేత్త ఆ గ్రామం లోకి అడుగుపెడతాడు. సైన్స్ ని నమ్ముకొని తన విధులను నిర్వహించే విక్రమ్, ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాడా లేదా అనేది స్టోరీ. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్ ప్లే, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేకా ఆకర్షణ, మిస్ కాకుండా చూడండి.