Actor Naresh : నెలలుగా రమ్య రఘుపతి ఆరోపణలపై మౌనం వహించిన నరేష్ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. మాజీ భార్యను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. రమ్య రఘుపతి తన జీవితంలోకి ఎలా వచ్చిందో? ఎలాంటి దారుణాలకు పాల్పడిందో? వివరించారు. నరేష్ మాట్లాడుతూ… రమ్య రఘుపతి మా అమ్మ విజయనిర్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరింది. ఆమెతో చనువు పెంచుకుంది. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరూ పెళ్లి చేసుకోరు. మా బంధువుల ద్వారా టెస్ట్ట్యూబ్ బేబీని పొందాలనుకుంటున్నానని చెప్పింది. జీవితం పాడుచేసుకోకు. నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటానని అన్నాను.

నేను ట్రాప్ లో పడ్డానన్న విషయం అర్థం కాలేదు. బిడ్డ పుట్టి ఏడాది కాకుండానే వ్యాపారాలు అంటూ మొదలు పెట్టింది. కమ్యూనికేషన్, పెర్ఫ్యూమ్స్, బేకరీ,రియల్ ఎస్టేట్ అంటూ పలు వ్యాపారాలు మొదలుపెట్టడం మూసేయడం చేసింది. నన్ను బెంగుళూరు వచ్చేయమనేది. మా అమ్మ అప్పుడు హెచ్చరించారు. తనకు డబ్బు పిచ్చి ఉంది. ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. విడాకులు తీసుకోకు బిడ్డ ఉన్నాడని చెప్పింది. రెండో బిడ్డ కావాలని నాతో గొడవ పడింది. బూతులు తిట్టింది.
రమ్య రఘుపతిది బ్యాడ్ బిహేవియర్. టెర్రస్ పై తాగి పడిపోయింది. ఆ విషయం పేరెంట్స్ కి కూడా తెలుసు. బెంగుళూరు పబ్బులో తనతో గతంలో నిశ్చితార్థం అయిన వ్యక్తితో గొడవ పడింది. ఇద్దరూ రక్తం వచ్చేవరకూ కొట్టుకున్నారు. ఓ ఫంక్షన్ కోసం న్యూడ్ డాన్సర్స్ ని పిలిపించింది. ఆమెకు డబ్బులు ఇవ్వొద్దని తన బంధువులే నాతో చెప్పారు.. లేటుగా వచ్చిన భర్తకు అన్నం పెట్టేది కాదు. తన ఫ్రెండ్ ఒకరు అత్యంత దారుణమైన విషయం బయటపెట్టింది. నీతో రెండో బిడ్డ కనాలని ఒత్తిడి చేస్తుంది ఆస్తి కోసమే. బెంగుళూరు తన శారీరక కోరికలు తీసుకోవడానికి వెళుతుందట. ఇవన్నీ నాకు చెప్పింది. మీరు ఆమెను కంట్రోల్ చేయడం లేదా అని అడిగింది.
ఆ రోజుతో నా మైండ్ బ్లాక్ అయ్యింది. రమ్యతో నాకు వివాహం జరిగింది 12 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్లుగా మాటల్లేవు. ఎవరి జీవితం వాళ్ళది అనుకున్నాము. మా మధ్య అవగాహన కూడా కుదిరింది. కానీ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తో కుమ్మకై నా ఫోన్ ట్యాప్ చేసింది. ఆడియోలు, వీడియోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేస్తుంది. భార్య భర్తలు రెండేళ్లకు పైగా విడివిడిగా ఉంటే విడాకులు వచ్చినట్లే అని సుప్రీం కోర్టే చెప్పింది. నీతో విడిపోయాక నా లైఫ్ నాది. నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి. పవిత్ర లోకేష్ నేను నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాము తప్పేంటి… అంటూ నరేష్ సంచలన ఆరోపణలు చేశారు.
https://www.youtube.com/watch?v=RtFj7XrX1AA