Taraka Ratna : నందమూరి తారక రత్న ఇటీవలే లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి క్రిందపది పోయాడు..ఆ తర్వాత ఆయనని సమీపం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి అత్యవసర చికిత్స చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం కుదుటపడలేదు..ప్రస్తుతం ఆయనని బెంగళూరికి తరలించి ICU లో శస్త్ర చికిత్స చేయిస్తున్నారు..కొద్దిసేపటి క్రితమే నారా చంద్ర బాబు నాయుడు హాస్పిటల్ కి చేరుకొని తారకరత్న కుటుంబీకులను కలిసి వాళ్లకి ధైర్యం చెప్పాడు.

రేపు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ కూడా హాస్పిటల్ కి రాబోతున్నారు..ఇదివరకే వాళ్లిద్దరూ ఫోన్ కాల్ ద్వారా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కనుగొన్నారు..ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమం గా మారిందని అంటున్నారు డాక్టర్లు..హార్ట్ లో అత్యధిక బ్లాక్స్ ఉండడం వల్ల ఆయన కోలుకునేందుకు బాగా సమయం పడుతుందని అంటున్నారు..అంతే కాకుండా తారకరత్న కి అరుదైన వ్యాధి సోకిందట.
ఆ వ్యాధి పేరు ‘మెలేనా’..ఇది ఒక అరుదైన వ్యాధిగా డాక్టర్లు చెప్తున్నారు..ఈ వ్యాధి సోకినవాళ్లకు జీర్ణాశయం లో రక్త ప్రవాహం కి సంబంధించినది..దీనివల్ల నోరు ,అన్నవాహిక మరియు పొట్ట భాగం లో బ్లీడింగ్ అవుతుంది..శరీరం లో రక్త కణాలు ఘణనీయం గా తగ్గిపోయి అనీమియా కి దారి తీస్తుంది..అంతే కాదు శరీరం రంగు మారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయని డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.
తారకరత్న ని కుప్పం ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినప్పుడు అక్కడి డాక్టర్లు కూడా చెప్పింది ఇదే..ఆయన శరీరం నీలం రంగు లోకి మారిపోయిందని చెప్పారు..శరీరం నీలంగా మారడం ఏంటి..అంటే తారకరత్న పై విష ప్రయోగం లాంటివి ఏమైనా జరిగాయా..అని అభిమానులు సందేహ పడ్డారు..కానీ అసలు కారణం ఇది అని ఇప్పుడు అందరికీ అర్థం అయ్యింది..ఇక తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.