Naresh-Ramya Raghupathi : నరేష్-రమ్య రఘుపతి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ భార్య రమ్య చేసిన ఆరోపణలపై మౌనం వహించిన నరేష్ ఎట్టకేలకు బరస్ట్ అయ్యారు. రమ్య ఎలాగైతే నరేష్ పై ఆరోపణలు చేసిందో… అదే మాదిరి నరేష్ తిరిగి ఆమెపై చేశారు. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయి. తాగుబోతు, డబ్బు పిచ్చి ఉంది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. అధిక వాటా వస్తుందని పిల్లల్ని కన్నది. బెంగుళూరు వెళ్లి శారీరక కోరికలు తీర్చుకునేది. పెళ్లి విషయంలో నేను ట్రాప్ లో పడ్డాను. ఆమె బంధువులే డబ్బులు ఇవ్వొద్దని నాకు సలహాలు ఇచ్చారు. రమ్య చెడు ప్రవర్తన కుటుంబ సభ్యులకు కూడా తెలుసని కామెంట్ చేశారు.

అలాగే నరేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన ఇన్నాళ్లు మౌనంగా ఎందుకు వున్నారో స్పష్టత ఇచ్చాయి. నరేష్ తనపై వచ్చే ఆరోపణలు అసలు సహించరు. గతంలో మా ఎన్నికల నేపథ్యంలో నాగబాబు, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఎవరేమన్నా నరేష్ వెంటనే బదులిచ్చేవారు. అలాంటిది… దాదాపు నెల రోజులుగా రమ్య రఘుపతి ఆయనపై చేయని ఆరోపణ లేదు. ఉమనైజర్, నీలి చిత్రాలు చూస్తాడు. కృష్ణతో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నరేష్ ఎఫైర్స్ గురించి తల్లి విజయనిర్మలకు తెలుసు… ఇలా ఘోరమైన కామెంట్స్ చేశారు.
రమ్య ఎంత దిగజార్చి మాట్లాడినా నరేష్ నోరు మెదపలేదు. కారణం ఆయన రమ్యకు భయపడ్డారని నిన్నటి ప్రెస్ మీట్ తో క్లారిటీ వచ్చింది. స్పై మాల్ వేర్ ఉపయోగించి నా ఫోన్ ట్యాప్ చేశారు. ఒక బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ సిద్ధం చేసుకొని నన్ను బెదిరించిందని నరేష్ అన్నారు. నీ దగ్గర నా ఆడియోలు, వీడియోలు ఏమున్నా బయటపెట్టుకో. నీతో విడిపోయాక నా లైఫ్ నాది. రెండేళ్లు భార్యకు దూరంగా ఉంటే విడాకులు వచ్చినట్లే. ప్రతి అడల్ట్ కి వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛ ఉందని కోర్టులే చెప్పాయని, నరేష్ అన్నారు.
నరేష్ మాటలను బట్టి నరేష్ ఆడియో టేప్స్, లేదా వీడియోలు రమ్య వద్ద ఉన్నాయి. వాటిని చూపుతూ ఆమె బ్లాక్ మెయిల్ చేశారు. అందుకే నరేష్ మౌనంగా ఉన్నారు. ఎంతకీ మారని రమ్య ఆగడాలు ఎక్కువవుతున్న తరుణంలో చేసేది లేక ఆయన తెగించాడన్న సందేహాలు కలుగుతున్నాయి. రమ్యపై నరేష్ దారుణ ఆరోపణలు చేయగా… కోపంతో రమ్య తన వద్ద ఉన్న బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ బయటకు వదిలితే ఆయన గౌరవానికి భంగం కలిగే ఛాన్స్ ఉంది. మరి చూడాలి వీరి రైవల్ స్టోరీ ఎలాంటి మలుపు తీసుకుంటుందో…