https://oktelugu.com/

Naresh On Mahesh Babu: పవిత్ర అంటే మహేష్ బాబు కి చాలా ఇష్టం: నరేష్ షాకింగ్ కామెంట్స్

పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు, అది ఆయన ఇష్టం, కానీ సమాజం వీళ్ళని అనుమతించలేదు కదా. మన సంస్కృతి , సంప్రదాయం ప్రకారం ఏ ఒక్కరు కూడా నరేష్ ని సమర్దించరు.

Written By:
  • Vicky
  • , Updated On : May 22, 2023 / 09:15 AM IST

    Naresh On Mahesh Babu

    Follow us on

    Naresh On Mahesh Babu: ఇటీవల కాలం లో మనకి మింగుడు పడని విషయం ఏమైనా ఉందా అంటే అది నరేష్ – పవిత్ర పెళ్లి వ్యవహారమే. వీళ్లిద్దరు గత రెండు సంవత్సరాల నుండి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా కొనసాగుతున్నారు. ఈ వయస్సు లో పెళ్లి చేసుకోవడం లో తప్పు లేదు, కానీ నరేష్ కి ఇప్పటి వరకు అలాంటి పెళ్లిళ్లు మూడు జరిగాయి, దానికి తోడు పవిత్రకి లోకేష్ కి మధ్య 20 ఏళ్ళ తేడా ఉంటుంది.

    పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు, అది ఆయన ఇష్టం, కానీ సమాజం వీళ్ళని అనుమతించలేదు కదా. మన సంస్కృతి , సంప్రదాయం ప్రకారం ఏ ఒక్కరు కూడా నరేష్ ని సమర్దించరు. పైగా మూడవ భార్య రమ్య విడాకులు ఇవ్వడం లేదని, ఆడ మనిషి, ఇన్ని ఏళ్ళు మనతో కలిసి ఉందనే గౌరవం కూడా లేకుండా ఆమెపై నరేష్ చేసిన ఆరోపణలు, సదరు మనిషికి చూసేందుకు చాలా అసహ్యంగా అనిపించింది.

    ఇదంతా పక్కన పెడితే వీళ్ళ ప్రేమ వ్యవహారం ని ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాగా తీశారు. ఈ చిత్రం ఈ నెల 26 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ విడుదల అయ్యాయి, ప్రొమోషన్స్ లో భాగంగా ఈ జంట ఇంటర్వ్యూస్ తెగ ఇచ్చేస్తున్నాయి.

    రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఒక యాంకర్ మీ ప్రేమ ని మహేష్ కుటుంబం ఒప్పుకుందా అని అడగగా , ఇంట్లో మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్న కృష్ణ గారు మరియు అమ్మ విజయ నిర్మల గార్లతో పాటుగా మహేష్ కుటుంబం అంతా కలిసే నిర్ణయం తీసుకుంటాము, మా ప్రేమ ని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేష్ కి పవిత్ర అంటే చాలా ఇష్టం మరియు గౌరవం కూడా అని చెప్పొచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.